rain
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

అలిపిరి మెట్ల మార్గంలో ముగిసిన ఆపరేషన్ చిరుత..!

అలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు సిసిఏఫ్ఓ నాగేశ్వరరావు వెల్లడించారు. నడక మార్గంలోని ఏడోవ మైలు వద్ద చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులో ఈ రోజు వేకువజామున చిరుత బోనుకు చిక్కింది. దీంతో చిరుత యొక్క నమూనాలను సేకరించేందికు తిరుపతి జూపార్క్ కు తరలించారు. అనంతరం సిసిఎఫ్ఓ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కాలినడక మార్గంలో సంచరిస్తున్న చిరుతను బంధించడం జరిగిందని, దాంతో ఏడో మైలు వద్ద సంచరిస్తున్న మొత్తం నాలుగు చిరుతలను బంధించడం జరిగిందన్నారు.. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో కేవలం ఈ నాలుగు చిరుతలను మాత్రమే కనిపించింది.

ఎలుగుబంటి కూడా పది రోజుల క్రితం కనిపించిన విషయం వాస్తమే, కానీ అయితే గత ఐదు రోజులుగా నడక మార్గం వద్ద ఏర్పాటు చేసిన మూడు వందల ట్రాప్ కెమెరాలకు ఎలుగుబంటి కనిపించలేదని, వర్షాలు పడుతుండడంతో ఎలుగుబంటి అటవీ ప్రాంతంలోనికి వెళ్ళినట్లు భావిస్తున్నాంమని చెప్పారు.. ఏ‌క్షణమైనా ఎలుగుబంటి కదలికలు ట్రాప్ కెమెరాలకు కనిపిస్తే వేంటనే ఎలుగుబంటిని బంధించేందుకు అటవీ శాఖా అధికారులు సిద్దంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

అటవీ ప్రాంతంలో అటవీ శాఖా సిబ్బంది బీట్ కు వెళ్తున్నారని, గత పది రోజులుగా ఈ చిరుత బోను వద్దకు వచ్చి తిరిగి వెళ్ళి పోవడంను గుర్తించాంమని, నడక మార్గంకు ఇరువైపుల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిరుత కదలికలు గుర్తిస్తే, వేంటనే వాటిని బంధించడం అనేది మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాంమని, బోన్ లను ఏడో మైలు వద్ద ఉంచుతాంమని, ట్రాప్ కెమెరాలతో వన్య‌మృగాల సంచారంపై నిరంతరం మానిటరింగ్ చేస్తాంమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందని, మరో ఐదు వందల కెమెరాలను కొనుగోలు చేస్తున్నాంమని, మరో వారం రోజుల్లో చిరుత పులి శాంపుల్స్ రిపోర్ట్ వస్తుందని, రిపోర్ట్ ఆధారంగా ఏ‌చిరుత చంపింది అనేది తెలుస్తుందని సిసిఏఫ్ఓ నాగేశ్వరరావు తెలియజేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ఆదివారం నాడు 79,152 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి రూ.4.02 కోట్ల రూపాయలు చెల్లిచారు భక్తులు. ఇక సోమవారం ఉదయం 10 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 30,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్., వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల కొరకు పాలు., మజ్జిగ., కిచిడి., ఉప్మా., సాంబార్ రైస్., పెరుగన్నం., సుండల్., మంచి అందిస్తోంది. నీటిని టీటీడీ ఇక సామాన్య భక్తుల కొరకు తిరుపతిలోని శ్రీనివాసం., విష్ణు నివాసం., గోవిందరాజ స్వామి వారి సత్రాల్లో ఎస్ఎన్డీ టైం స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది