ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అమరావతి పెద్ద స్కామ్ అని సజ్జల ఆరోపణలు- వైఎస్ఆర్ ఫ్యామిలీకి సోనియా ద్రోహం చేయలేదన్న షర్మిల

వైఎస్ఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఎలాంటి ద్రోహం చేయలేదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్పష్టం చేశారు. ఇడుపులపాయలో వైఎస్ కు నివాళులు అర్పించిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆమె పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తో కీలక వ్యాఖ్యలు చేశారు.  జగన్ అక్రమాస్తుల కేసులోని ఎఫ్ఐఆర్‌లో వైఎస్ఆర్ పేరు కూడా ఉందని.. చనిపోయిన వైఎస్ పేరు ఎఫ్ఐఆర్‌లో  చేర్చడానికి కారణం సోనియా గాంధీ అని ని మా వాళ్లు కూడా నన్ను ప్రశ్నించారని గుర్తు చేశారు.

చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ప్రముఖ పత్రికల్లో వచ్చినా  చంద్రబాబునాయుడు కానీ ఆయన పార్టీ నేతలు కానీ ఎందుకు స్పందించలేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రదర్శించారు.  సాక్షాధారాలతో సహా  అన్ని  వివరాలు ఉన్నాయన్నారు.  అమరావతి  అనే భోగస్  ప్రాజెక్ట్  తో  చంద్రబాబు  పెద్ద  స్కామ్  చేశారని  ఆరోపించారు.  రాజధాని  కట్టాలని  ఆలోచన  చంద్రబాబు  కు  లేదని.. చంద్రబాబు  ప్రతి  ఆలోచన  పెద్ద  స్కామ్ అని ఆరోపించారు.

తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.  తాజాగా బెంగళూరులో డీకే శివకుమార్ తో రేవంత్   రెడ్డి సమావేశం అయ్యారు. ఆ ఫోటోను ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత .. తెలంగాణ కాంగ్రెస ఢిల్లీ వయా బెంగళూరు అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఢిల్లీకి గులామలేనని ఈ సారి కూడా అంతే కానీ కొత్తగా బెంగళూరు బాస్ వచ్చారన్నట్లుగా కవిత ఆ పోస్ట్ చేశారు. వెంటనే రేవంత్ రెడ్డి .. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి నమస్కరిస్తున్న ఫోటోపెట్టి కౌంటర్ ఇచ్చారు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన ‘నిక్కర్’…లిక్కర్… లాజిక్కు అని విమర్శలు గుప్పించారు.

ఇవాళ దివంగత నేత వైస్‌ రాజశేఖర్‌రెడ్డి 14వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ప్రజలకు ఆయన సేవలను మరోసారి గుర్తుచేసుకున్నారు. నాన్నామీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది అంటూ భావొద్వేగంతో ట్వీట్‌ చేశారు. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెట్టి అన్నారు. ఆయన పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలే.. తనకు కొండంత అండగా నిలిచాయని చెప్పారు. తండ్రి ఆశయాలే తనను నడిపిస్తున్నాయన్నారు. సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయన చేయిపట్టి నడిపిస్తున్నారని చెప్పారు. వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను నాన్న అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌లోకి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానిస్తున్నారు ఆపార్టీ నేతలు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి తుమ్మల ఇంటికి వెళ్లి.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ‌కాంగ్రెస్ పార్టీ చేరమని ఆయన్ను ఆహ్వానించారు. అయితే, ఖమ్మం జిల్లా ప్రజలు, అనుచరుల అభిప్రాయం మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని తుమ్మల స్పష్టం చేశారు.