ఆ భగవంతుడి దయతో ఈరోజు రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నామని… అందులో మొదటిది కౌలురైతులతో పాటు దేవాదాయభూములు సాగుచేసుకుంటున్న కౌలురైతులకు కూడా కలిపి.. వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం అందిస్తున్నాం అని ఏపీ సీఎం జగన్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైఎస్సార్ రైతు భరోసా ఆర్థిక సహాయం కింద రూ.109.01 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ సీఎం వైఎస్. జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్. జగన్ మాట్లాడుతూ, ఆ భగవంతుడి దయతో ఈరోజు రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నామని… అందులో మొదటిది కౌలురైతులతో పాటు దేవాదాయభూములు సాగుచేసుకుంటున్న కౌలురైతులకు కూడా కలిపి.. వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం అందిస్తున్నాం అని అన్నారు.
ఇక రెండో అంశం ఏంటంటే.. ఈ ఏడాది ఖరీప్ సీజన్‌లో కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా రైతుల చేతుల్లో పెట్టే మరో కార్యక్రమం జరుగుతోంది అని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు ఇంత తోడుగా నిలబడుతున్న ప్రభుత్వం ఏపీ మాత్రమేనని సీఎం జగన్ స్పష్టంచేశారు.
రైతులతో పాటు ఏ వ్యవసాయ భూమీ లేని నిరుపేద రైతులైన…. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి అండగా, తోడుగా నిలబడుతుందన్నారు. అందులో భాగంగానే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా అందివ్వడం జరుగుతోందన్నారు.
దేశంలో మరెక్కడా లేనివిధంగా, ఎక్కడా జరగని విధంగా ఆర్వోఎఫ్‌ఆర్ అంటే అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు సైతం తోడుగా ఉంటూ వారికి ఆర్‌ఏఎఫ్‌ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా… వారికి కూడా రైతుభరోసా పథకం కింద ఆర్థిక సహాయం అందించి తోడుగా ఉండే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న వారికి కూడా వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ 50 నెలల్లోనే దాదాపు 5.28 లక్షల మంది కౌలు రైతులకు, 3.99 లక్షల ఆర్‌ఓఎఫ్‌ఆర్ అంటే అటవీ భూములు సాగుచేసే గిరిజనులు మొత్తం 9.22 లక్షల మందికి మంచి చేస్తూ… రూ.1122 కోట్లు వారికి పెట్టుబడి సహాయంగా ఇచ్చి మంచి చేయగలిగాం.
అందులో భాగంగానే 2023–24 సీజన్‌కు సంబంధించి… కౌలురైతుల కోసం మంచి చట్టాన్ని తీసుకొచ్చి, రైతులెవరికీ కూడా నష్టం లేకుండా 11 నెలల పాటు సీసీఆర్‌సీ కార్డులను గ్రామసచివాలయంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. సీసీఆర్సీ కార్డు కౌలురైతులకిచ్చిన పక్షంలో రైతులకు జరగాల్సిన మేలు జరగకుండా పోదు. వాళ్లకు కూడా రైతు భరోసాతో సహా అన్నీ వస్తాయి. సీసీఆర్సీ కార్డు పొందిన కౌలు రైతులకూ రైతుభరోసాతో పాటు మిగిలినవీ వస్తాయిని ఒక చట్టం తీసుకువచ్చాం. అందులో భాగంగా గ్రామసచివాలయాల్లోనే సీసీఆర్సీ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చాం. తద్వారా కౌలురైతులకు, రైతులకు మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిర్చి, రైతులు ఏమాత్రం నష్టపోకుండా కౌలురైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం.
అందులో భాగంగా రైతు సమ్మతితో సీసీఆర్సీ కార్డులు పొంది, కౌలు చేస్తున్న ఈ రైతులందరికీ తొలివిడత ఇస్తున్న రూ.7,500 సొమ్మనును పెట్టుబడి సాయంగా అందిస్తున్నాం. ఈ మేరకు ఈ రోజు 1,46,324 మంది సీసీఆర్సీ కార్డులు ఇచ్చిన కౌలు రైతులకు తోడుగా అండగా నిలబడుతూ ఇవాళ మొదట విడత పెట్టుబడి సాయం రూ.7,500 చొప్పున రూ.109 కోట్లను తొలివిడత సాయంగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్జీ కౌలురైతులందరికీ ఈ డబ్బు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.