liquor
తెలంగాణ రాజకీయం

తెలంగాణలో ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్

తెలంగాణ ప్రభుత్వ ఖజనాకు ఎన్నికల సీజన్‌లో లిక్కర్ సేల్స్ కాసుల వర్షం కురిపించాయి. ఆగస్టు నెలలో మందుబాబులంతా రికార్డు స్థాయిలో మద్యం తాగేసి ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకూర్చారు. ఆగస్టులో డిపోల నుంచి రూ.3వేల కోట్ల విలువ చేసే మద్యం సరఫరా కాగా.. మద్యం దరఖాస్తులు, వైన్ షాపుల మొదటి విడత టెండర్లతో పాటు రూ.3వేల కోట్లు అదనంగా వచ్చాయి. దీంతో ఆ ఒక్క నెలలోనే ప్రభుత్వానికి రూ.6వేల కోట్లు సమకూరినట్లు అయింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2,620 మద్యం షాపులతో పాటు.. వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు ఉన్నాయి.అయితే 2016 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలను పరిశీలించగా.. తెలంగాణలో రూ.14,184 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కానీ ఒక్క 2022లోనే ప్రభుత్వానికి రూ.35వేల కోట్ల ఆదాయం సమకూరింది.అలాగే ప్రస్తుతం తెలంగాణలో ప్రతి రోజు రూ.110కోట్ల లిక్కర్ సేల్స్ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.కానీ 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఐదు నెలల్లోనే.. రూ.15,346 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దీనిని బట్టి మందు బాబులు ఏ రేంజ్‌లో తాగి ఊగుతున్నారో ఈజీగా అర్ధం అవుతుంది.

కేవలం ఏడేళ్లలోనే తెలంగాణలో మద్యం విక్రయాలు రెట్టింపు అవడంపై ఆర్ధిక నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న కల్చర్‌తో పాటు మారుతున్న అలవాట్లకు యూత్ ఎక్కువగా ఆకర్షితులవడం కూడా దీనికి కారణమని అంటున్నారు. ఇటు లిక్కర్ సేల్స్ వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం మూడింతలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఒక్క ఆగస్టు నెలలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుంచి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.