సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలు అన్వేషిస్తూ అమాయకుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇల్లు అద్దెకు ఇస్తానని టులెట్ బోర్డు పెట్టిన ఓనర్ కు సైబర్ కేటుగాళ్లు షాకిచ్చారు.కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లు మారిపోతున్నాయి పరిస్థితులు. రోజు రోజుకు సైబర్ నేరాలను కొత్తపుంతల్ని తొక్కిస్తున్నారు. అమాయకులే లక్ష్యంగా కొత్త మార్గాల్లో కేటుగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతుంది. ఆ టెక్నాలజీలో లోపాలను కనిపెట్టి సామాన్యుల డబ్బుకొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. నిన్నటి వరకూ కరెంట్ బిల్లులు కట్టలేదని ఫేక్ మెసేజ్ లు పంపి ఖాతాల్లో డబ్బు మాయం చేస్తున్నారు. తాజాగా విజయవాడలో టులెట్ బోర్డు పెట్టిన ఓ యజమానిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. ఓఎల్ఎక్స్ లో ఇళ్లు అద్దెకు ఇస్తామని టులెట్ బోర్డు పెట్టిన ఓనర్ నుంచి 4.35 లక్షలు దోచేశారు సైబర్ కేటుగాళ్లు.విజయవాడ కానూరుకు చెందిన సత్యనారాయణ తన ఫ్లాట్ ను అద్దెకు ఇచ్చేందుకు ఓఎల్ఎస్స్ లో టులెట్ బోర్డు పెట్టాడు. దీనిపై ఉన్న ఫోన్ నెంబర్ కు కొన్ని రోజులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ఆర్మీలో పనిచేస్తానంటూ ఓ వ్యక్తి సత్యనారాయణకు ఫోన్ చేశాడు.
ఫ్లాట్ అద్దెకు కావాలని, కొన్ని ఫోటోలు పెట్టమని ఇంటి యజమానిని నమ్మించాడు. సైబర్ కేటుగాడి మాటలు నమ్మిన సత్యనారాయణ వెంటనే ఫ్లాట్ ఫొటోలు తీసి పెట్టాడు. ఇల్లు నచ్చిందని, అద్దెకు దిగుతానని నమ్మించి యజమాని ఖాతాల్లోంచి డబ్బు కొట్టేశారు. అడ్వాన్స్ ఇస్తానని చెప్పి ఫోన్ పే ఓపెన్ చెయ్యమని చెప్పాడు సైబర్ మోసగాడు. ఫోన్ పే ఓపెన్ చేసిన కొద్దిసేపటికి సత్యనారాయణ బ్యాంకు ఖాతాలో డబ్బు మొత్తం ఖాళీ అయింది. అయితే తాను ఎలాంటి ఓటీపీ, ఖాతా వివరాలు చెప్పకుండా డబ్బులు పోయాయని ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నప్పుడు గుడ్డిగా ‘అలౌ’ కొడుతున్నారా? ఇదే మీ ఖాతాలు ఖాళీ చేస్తాయి. కొత్త ఫీచర్స్ యాప్స్, ఏపీకే ఫైల్స్ మార్కెట్‌లోకి నిత్యం వస్తూనే ఉన్నాయి. గతంలో ఏవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే.. ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయడానికి పరిమితమైన నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు యాప్ ఇన్ స్టాల్ చేసుకోడానికి వ్యక్తి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, కాంటాక్ట్స్ వంటివి విలువైన వాటిని అనుమతి ఇస్తేనే యాప్స్ ఓపెన్ అవుతున్నాయి.
సైబర్ నేరగాళ్లకు ఈ సమాచారమే సంపదగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ డేటాను విశ్లేషించి అమాయకులను బురిడీ కొట్టింటి డబ్బు లు దోచుకుంటున్నారు. థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసే క్రమంలో అలౌ కొడతాం. ఈ అనుమతే మన కాంటాక్ట్ లిస్టులో సమాచారం, గ్యాలరీ, వీడియోలు వంటి ముఖ్యమైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి దక్కుతుంది. స్మార్ట్ వాచ్ యాక్టివేట్ చేయడానికి నిబంధనలు అర్థం చేసుకోకుండానే యాక్సెప్ట్ క్లిక్ చేస్తుంటాం. ఇలా ఇచ్చిన అనుమతులే సైబర్ నేరగాళ్లు వారికి అనుకూలంగా మార్చుకుంటారు. ఇలా అనుమతులు అడుతున్నారంటే సైబర్ నేరగాళ్ల వలలో పడినట్లే. థర్డ్ పార్టీ యాప్స్ వల్ల సైబర్ నేరాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.