అమరుల త్యాగాలు వృదా కావు
అమరుల ఆశయాల సాధన కోసం ప్రజా పోరాటాల సిద్దమైందాం
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
ఆనాడు నిజాం నవాబుతో ప్రాణ త్యాగలకు తెగించి తెలంగాణ సాయుధ పోరాటం చేసిన అమరవీరుల పోరాట ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరిచి పోయారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
శుక్రవారం నాడు హుస్నాబాద్ మండలం కేంద్రంలో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్ రావు విగ్రహంనికి పుల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదల రాజ్యం స్దాపన కోసం ఆనాడు నిజాం నవాబుతో ఎదురొడ్డి నిలిచిన భారత కమ్యూనిస్టుపార్టీ సిపిఐ నేతలు బద్దం ఎల్లారెడ్డి,రావి నారాయణరెడ్డి, మగ్దూం మెయినినోద్దిన్, అనభేరి ప్రభాకర్ రావు,సింగిరెడ్డి భూపతి రెడ్డి,కళలు కన్న పేదల రాజ్యం ఇప్పటికి రాలేదని దోపిడి పాలకుల రాజ్యంలో ప్రజలు నలిగి పోతున్నారని పేదల రాజ్యం స్దాపన కోసం నేడు ప్రజలంతా ఒకటి కావాలని అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని చాడ వెంకటరెడ్డి అన్నారు.
హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి సిపిఐ పోరాటల ఫలితంగానే పేదలకు ఇండ్ల స్థలాలు,పక్కఇండ్లు, ప్రభుత్వ వ్యవసాయ భూములు, అనేక చట్టాలు,గండిపెల్లి,గౌరవెల్లి, తొటపెల్లి ప్రాజెక్టులను సాధించినది సిపిఐఅని అనునిత్యం ప్రజల కోసం పనిచేసే ఎకైకైక పార్టీ సిపిఐ ఒక్కటేనని సిపిఐ కంటికిరెప్పలా కాపాడుకోవాలని చాడ వెంకటరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పులబాలమల్లు,
యెడల వనేష్,
జాగీర్ సత్యనారాయణ,
నియోజకవర్గం నాయకులు
బొయిని అశోక్,
అందే స్వామి,
కొయ్యడ సృజన్ కుమార్,
ముద్రకోలరాజయ్య,
బత్తుల బాబు,
చాడ శ్రీదర్ రెడ్డి, చిగురుమామిడి,
అక్కన్నపెట,
కొహెడ,భీమదేవరపల్లి,
ఎల్కతుర్తి మండలాల కార్యదర్శులు నాగేల్లి లక్ష్మారెడ్డి,కొమ్ముల భాస్కర్,ముంజ గోపి,ఉట్కురి రాములు,సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు భారత జాతీయ మహిళా సమాఖ్య నాయకురాల్లు గూడెం లక్ష్మి,గూడ పద్మ,మంచాల రమాదేవి,పిల్లి రజినీ, నేలవేణి స్వప్న,దుద్దేడ శశిరేఖ, పొన్నాల స్వప్న, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుట్ల శంకర్,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జెరిపొతుల జనార్దన్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,కొయ్యడ కొమురయ్య,ఏగ్గొజు సుదర్శన్ చారి, మంద శ్రీనివాస్,గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల ప్రసాద్,సిపిఐ మండల నాయకులు పోదిల కుమారస్వామి,అయిలేని మల్లారెడ్డి,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.