తెలంగాణ రాజకీయం

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సీఎం జగన్

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ‘ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టైన ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను. ఇన్ని దొంగతనాలు చేసినా చంద్రబాబు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగలముఠా సభ్యులు ఉన్నారు.  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియోతో అడ్డంగా దొరికినా పత్రికలు, టీవీల్లో నిజాలను చూపించరు.  ఆ పని సబబేనని సపోర్ట్ కూడా చేస్తారని విమర్శించారు.