🔹మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 12వ రోజు దివ్యాంగులతో నిరసన కార్యక్రమం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 అక్రమ అరెస్టులు, వేధింపులు, లాఠీలు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఈ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అణిచివేయాలని చూస్తుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. చంద్ర బాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఇవన్నీ చూసిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఘోరపరాజయాన్ని ఎదుర్కోబోతుంది. ప్రజలు అంత కసిగా, కోపంగా ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 మేముసైతం చంద్ర బాబు నాయుడు గారి కోసం అంటూ ముందుకు వచ్చిన దివ్యాంగులందరికి రెండు చేతులు జోడించి, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు, క్లస్టర్ ఇంఛార్జులు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, సారంగం గున్నయ్య, టీడీపీ నాయకులు కోటిరెడ్డి, యానాది రెడ్డి, సి.హెచ్. లక్ష్మీ రెడ్డి, మేకల మధు, వడ్లమూడి రమేష్ చౌదరి, వదనాల వెంకట రమణ, చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, టి.ఎస్. శ్రీనాధ్, హరి కృష్ణ, కుమార్ హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.