padayatra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

29 నుంచి యువగళం..

టీడీపీ యువ నేత నారా లోకేశ్ పాదయాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే ప్రారంభమవుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఆయన అధ్యక్షతన పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది సెప్టెంబరు 29న లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుందని తెలిపారు. కక్షసాధింపులే ధ్యేయంగా జగన్ సర్కార్ రోజుకొకటిగా తెరపైకి తెస్తున్న తప్పుడు అంశాలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయించిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని.. దీనిపై కూడా సమావేశంలో చర్చించామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి శుక్రవారం రాత్రి 8.15 నిమిషాల నుంచి రాజోలు నుంచే ప్రారంభించాలని లోకేశ్ తోపాటు మేమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నామన్నారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ ఏపీలో జరిగే పార్టీ కార్యకలాపాలను ఢిల్లీ నుంచే పర్యవేక్షిస్తున్నారు.

టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ (పీఏసీ) సమావేశం కోసం ఢిల్లీ నుంచి లోకేశ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు. పీఏసీ సభ్యులకు లోకేశ్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, బాలకృష్ణ, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. టీడీపీ పీఏసీ సమావేశంలో ఇటీవల చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపైనా చర్చించారు.