ముఖ్యాంశాలు

కత్తి మహేశ్‌ ఎడమ కంటిచూపు పోయిందంటూ ప్రచారం

ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది.  ఎయిర్ బ్యాగ్స్ తెర‌చుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న త‌ల‌, ముక్కు,కంటికి  తీవ్ర గాయాల‌య్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మెద‌డులో ఎలాంటి రక్త‌స్రావం జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల‌న మ‌హేష్‌కు ప్రాణాపాయం లేదని తెలుస్తుంది. అయితే  ఆయన  ఎడ‌మ కంటి చూపు మాత్రం పూర్తిగా పోయిందని ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లు తమతో చెప్పారని కత్తి మహేష్‌ మేనమామ ఒకరు మీడియాకు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతుంది. సర్జరీ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు కత్తి మహేశ్ త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు.  ఈ ఘటనలో కత్తి మహేశ్‌ కారు నుజ్జు, నుజ్జు అయిన విషయం తెలిసిందే.  పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్‌ పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే.