cps-ban
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సి పి ఎస్ రద్దు గ్యారంటీ ని ఎన్నికల మ్యానఫెస్టోలో చేర్చండి

రాష్ట్రంలో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు సిపిఎస్ రద్దు పై స్పష్టత , గ్యారంటీ  తెలియజేస్తూ మేనిఫెస్టోలో పెట్టాలని టి ఎస్ సి పి ఎస్ ఈ యు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి  బడుగుల సైదులు  శని వారం  నాడు పత్రికా ప్రకటన ద్వారా కోరారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్  పదవీ విరమణ తర్వాత పెన్షన్ కు భద్రతా భరోసా లేని సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు, పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.  సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర పరిధిలోనే ఉన్నదని, ఇప్పటికే దేశంలో ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ ను రద్దు చేశాయని తెలిపారు. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులకు భరోసా ఉంటుంది. ఉద్యోగి చివరి నెల వేతనంలో పదవి విరమణ తర్వాత 50%  వేతనాన్ని పెన్షన్ గా పొందుతారు దీనితో గ్యారంటీగా నిర్దిష్టమైన మొత్తాన్ని పెన్షన్ గా పొంది ఉద్యోగి వృద్ధాప్యంలో జీవితానికి రక్షణగా ఉంటుందని తెలిపారు.

సిపిఎస్ విధానంలో ఉన్న నష్టాలను, పాత పెన్షన్ వలన కలిగే ప్రయోజనాలను, సిపిఎస్ ను రద్దు చేయటం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని , మొత్తం చెల్లించే వాటా సొమ్మును సంక్షేమ అభివృద్ధి పథకాలకు వినియోగించవచ్చునని.నివేదికల రూపంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను  కలిసి టీఎస్ సిపిఎస్ఇ యూ నాయకత్వం వివరించి, విన్నపం చేయటం జరిగిందన్నారు. మూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల మేలును దృష్టిలో పెట్టుకొని స్పష్టతతో గ్యారంటీ తో కూడిన సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు  నిర్ణయాన్ని మ్యానిఫెస్టోలో చేర్చాలని, కార్యాచరణ ప్రకటన చేయాలని కోరారు.