pravallika
తెలంగాణ రాజకీయం

ప్రవళిక మరణం ప్రభుత్వ హత్యే నిరుద్యోగ యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం

స్ధానిక అంబేడ్కర్ సంటర్లో శుక్రవారం ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై ప్రవలికా మరణించగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని నిరసనతెలిపిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనంతరం మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రద్దు కారణంగా మనస్థాపానికి గురైన నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బిక్కజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవలిక  ఆత్మహత్యను ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని నెక్కొండ మండల అధ్యక్షుడు బక్కి అశోక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి పట్టణ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ రఘు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండి శివకుమార్ మండల నాయకులు కుసుమ చెన్నకేశవులు ఈదునూరి సాయికృష్ణ అన్నారు. అనంతరం బక్కీ అశోక్  మాట్లాడుతూ నోటిఫికేషన్ల రద్దు పేరుతో పేపర్ లీకేజీల పేరుతో నిరుద్యోగ  యువతను దారుణంగా మోసం చేస్తున్న ఈ అధికార పార్టీనీ తెలంగాణ రాష్ట్రం తరిమికొట్టాలి అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయని కొంతమంది విద్యార్థులు బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దొంగల ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోగా వారి ప్రాణాలు తీసుకునే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది అన్నారు .

వచ్చిన తెలంగాణలో ఇచ్చిందేమీ లేదన్నారు హామీలు తప్ప ఏవి అమలు కాలేదు అన్నారు ఈ కార్యక్రమంలో నెక్కొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రావుల మైపాల్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు సింగం ప్రశాంత్ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు ఈదునూరి దిలీప్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల కిష్టయ్య బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సముద్రాల కనకయ్య ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఎడంపాక ప్రకాశం ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ శ్రీకాంత్ అలంకానిపేట గ్రామ పార్టీ అధ్యక్షులు రాంపల్లి శ్రవణ్ బానోతు శ్రీకాంత్ ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు భూక్య శరత్ అబ్బదాసి గౌతమ్ ఈదునూరి శివాజీ మోతే విక్కి చిన్నూరి కార్తీక్ కొంగర దినేష్ పిట్టల రాజ్ కుమార్ కొమ్ము దయాకర్ తదితరులు పాల్గొన్నారు.