ఓటర్లు అప్రమత్తంగా ఉండి జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. ‘ఓటర్ ఐడీ కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు ఉందని భావించవద్దు. జాబితాలో మీ పేరును రీ చెక్ చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. హైకోర్టులో స్వీప్ యాక్టివిటీ కింద ఏర్పాటు చేసిన రీ చెక్ యువర్ ఓటు కౌంటర్ ను డిప్యూటీ డీఈవో అనుదీప్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బందితో మాట్లాడి ఓటరు జాబితాలో తమ పేరు ఎలా చెక్ చేసుకోవాలో అవగాహన కల్పించారు. https://voters.eci.gov.in/
Voters’ Services PortalWeb site created using create-react-appvoters.eci.gov.in |
లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సందేహాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించాలని స్పష్టం చేశారు.రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం సువిధ యాప్ ద్వారా ముందస్తు అనుమతులు తీసుకోవాలని, 24 గంటల్లోగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వీవీఐపీలు, వీఐపీల పర్యటన సమయంలో స్థానిక పోలీస్ అధికారులతో పాటు పార్టీ నాయకులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు, ముఖ్య అతిథులకు ఇబ్బందులు కలుగకుండా సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు.
తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ గుర్తింపు నిర్ధారణ విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ సీఈసీ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఇటీవల లేఖ రాసింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct)ని కచ్చితంగా అమలు చేసి ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జిల్లా ఎన్నికల అధికారి, రొనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా, మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారమైనా, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తికి, సమాచారం కోసం సంప్రదించిన వెం టనే స్పందించాలని చెప్పారు. సి-విజిల్ ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరించాలన్నారు.ఎక్కడైనా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే క్షేత్రస్థాయిలో ప్లయింగ్ స్వ్కాడ్‌లను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతీ విభాగానికి వేర్వేరుగా రికార్డులను నిర్వహించాలన్నారు. ఆయా బృందాలతో శాసనసభ నియోజకవర్గాల వారీగా విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అధికారులు ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అధికారులు ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు ఎన్నికల సంబంధిత ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు కానుకల పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.