kaleshwaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు మంగళవారం  తెలంగాణకు రానున్న కేంద్ర బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులోకి ముఖ్య భాగమైన మేడిగడ్డ  (లక్ష్మి) బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. బ్యారేజీ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి  గజేంద్ర షెకావత్కు లేఖ రాశారు.
దీనికి స్పందించిన కేంద్ర మంత్రి  గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారు. . కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో  ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ బృందం ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో  సమావేశమై.. రేపు కాళేశ్వరం డ్యామ్ ను సందర్శించనుంది.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరం. 6వ బ్లాక్లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయి. సందర్భంగా పెద్దగా శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. దీంతో బ్యారేజ్ లోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలేశారు. గునీటికోసం జమచేసిన నీళ్లన్నీ వ్యర్థంగా కిందికి వదలాల్సి వచ్చింది. దీని కారణంగా దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు రాత్రంగా భయంభయంగా గడిపారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతపై ఎదరువతున్న ప్రశ్నలకు సమాధానంగా.. దయచేసి కేంద్రబృందాన్ని పంపించి పరీక్షలు నిర్వహించగలరని కిషన్ రెడ్డి లేఖలో కోరారు. .