ysr cheyutha
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కష్టంలో ఉన్న వారికి మేమున్నామంటూ వెస్సో సంస్థ చేయూత

కష్టంలో ఉన్న వారికి మేమున్నామంటూ చేయూత నిచ్చి ఆదుకుంటుంది వెస్సో సంస్థ .సంస్య్జ వద్ద తగిన డబ్బులు లేకపోయినా దాతలనుండి సహాయం పొంది చేయూత నిస్తుంది. కృష్ణా జిల్లా, చిలకలపూడి నివాసి, మానేపల్లి గాయత్రి (47) భర్త కరోనా సమయంలో అకాల మరణం చెందారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. భర్త జీవించి ఉన్న సమయంలో వీరు పెద్ద అమ్మాయి పెళ్లి చేసారు. భర్త మరణానంతరం, ఆమె అనారోగ్యం పాలవడంతో  తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కొడుకు చేసే బిందెలు వెల్డింగ్ పని ద్వారా వచ్చే కొద్ది పాటి ఆదాయంతోనే కుటుంబ పోషణ జరుగుతుంది.ఈ నెల 26వ తారీఖున స్థానిక దేవాలయంలో వారి రెండవ కుమార్తె చి. మాధురి వివాహం జరుగనున్నది. ‘విశ్వంలో విలీనం’ సేవా సంస్థ స్థాపకులు, పెంట శ్రీనివాసాచారి ద్వారా తన రెండవ కూతురి వివాహానికి గాను ఆర్థిక సహాయం కొరకు వెస్సో ను ఆశ్రయించారు.గౌరవ దాతల సహకారంతో వెస్సో 42,600 రూపాయలు వధువు తల్లి గాయత్రి కి అందచేసింది.ఈ సందర్భంగా వెస్సో అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ కష్టంలో ఉన్న వధువు తల్లి కి చేయూత నిచ్చిన గౌరవ దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.