bail-chandra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బెయిల్ షరతులివే

స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ
హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. అయితే ఈ బెయిల్కి కోర్టు 5 కండీషన్లు విధించింది.
1. పిటిషనర్ చంద్రబాబు రూ.1 లక్ష పూచీకత్తుతో 2 షూరిటీలు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
2. పిటిషనర్ చంద్రబాబు ఆయనే పరీక్షించుకొని/చికిత్స తీసుకోవాలి. హాస్పిటల్ ఎంపికతోపాటు ఖర్చు కూడా ఆయన భరించుకోవాలి.
3. తనకు ఇచ్చిన చికిత్సకు సంబంధించిన వివరాలను పిటిషనర్ కోర్టుకు తెలియజేయాలి. ఏ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కి సీల్డ్ కవర్ ద్వారా ఈ
సమాచారం అందించాలి. ఈ సీల్డ్ కవర్ అధికారి ట్రయల్కు పంపించాలని కోర్టు స్పష్టం చేసింది.
4. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినీ ప్రలోభపెట్టడం, బెదిరింపులు లేదా హామీలు ఇవ్వడం లాంటివి చేయకూడదు. కోర్టు లేదా మరేదైనా సంస్థకు సంబంధించిన
వివరాలు చెప్పాలని కోరకూడదు.
5. నవంబర్ 28, 2023న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో తనంతట తానే సరెండర్ కావాలి