తెలంగాణ ఎన్నికల బరిలో చాలా పార్టీలు బరిలో దిగనున్నాయి. ఒకవైపు అధికార బీఆర్ఎస్ నెల రోజు క్రితమే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందు వరుసలో నిలిచింది. అయితే కాంగ్రెస్ ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు బస్సుయాత్రలు, బహిరంగసభల పేరుతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించింది. మన్నటి వరకూ సీట్ల సర్థుబాటు విషయంలో మీన మేషాలు లెక్కించాయి రెండు పార్టీలు. అయితే తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఎట్టకేలకు ఖరారైంది.వీరిద్దరి పొత్తులో భాగంగా జనసేనకు 8 లేదా 9 సీట్లు కేటాయించేందుకు సిద్దమైంది కమలం పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేనకు రెండు స్థానాలు కేటాయించేందుకు సిద్దమైంది. కూకట్‌పల్లితో పాటు గ్రేటర్‌లో మరో సీటు జనసేనకు కేటాయించింది. ఇక మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో జనసేన నుంచి 30కి పైగా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన స్థానాలకే పరిమితమైంది.
ఈ ఇరుపార్టీల కెమిస్ట్రీ ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో తెలియాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు. ఈ ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా చూపుతుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..
కూకట్‌పల్లి
వైరా
ఖమ్మం
అశ్వరావుపేట
కొత్తగూడెం
కోదాడ
నాగర్‌కర్నూల్
తాండూరు
గ్రేటర్ పరిధిలో మరో సీటు