congress
తెలంగాణ రాజకీయం

పఠాన్ చెరువుపై కాంగ్రెస్ పునరాలోచన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పీక్స్‌కు చేరింది. అధికార ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రచారం, అభ్యర్థుల ప్రకటన సజావుగానే సాగినా తన మార్క్‌ లాగులాటతో కాంగ్రెస్ సతమతమవుతోంది. అందుకే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. అయినా పంచాయితీలు మాత్రం తగ్గడం లేదు. మూడో జాబితా అర్థరాత్రి విడుదలైంది. కానీ తూర్పు తెల్లారేసరికి అసంతృప్తులు ప్రధాన నేతల ఇంటి ముందు గాంధీభవన్ ముందు ప్లకార్డులు పట్టుకొని గుడ్‌మార్నింగ్ చెప్పేశారు. మూడో జాబితాలో జాబితాలో చోటు దక్కలేదని తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో రుసరుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డవారంతా రోడ్డు ఎక్కుతున్నారు. తమ అసంతృప్తిని అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. అధినాయకత్వంపైన, పీసీసీ చీఫ్‌పై విమర్శలు చేస్తున్నారు.

నారాయణఖేడ్, పటాన్ చెరు, బోథ్, వనపర్తి, చెన్నూరు, పాలకుర్తి, డోర్నకల్, తుంగతుర్తి, సంగారెడ్డిలో ఆందోళనలు మిన్నంటాయి. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని, కొత్తగా చేరిన వారికి సీట్లు కేటాయించడంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.అందరికంటే పటాన్‌చెరు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయంపై మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ గుర్రుగా ఉన్నారు. తన అనుచరుడైన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌కు టికెట్‌ ఇవ్వకుండా నీలం మధుకు ఇవ్వడంపై మండిపడ్డారు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న మధు ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్‌ గూటికి వచ్చారని గుర్తు చేశారు. మొదటి నుంచి పార్టీ బలోపేతానికి కష్టపడి ప్రజాసమస్యలపై పోరాడిన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌కు టికెట్ నిరాకరించడంపై ఆయన సీరియస్ అయ్యారు. మరికాస్త ముందుకెళ్లిన దామోదర్ రాజనరసింహ రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే కలుగుచేసుకొని ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.

ఠాక్రేతో కూడా దామోదర్‌ సీరియస్‌గా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇష్టం వచ్చిన వాళ్లకు టికెట్లు ఇస్తే రాజకీయాలు ఎలా చేయాలని ప్రశ్నించినట్టు ప్రచారం నడుస్తోంది. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఎలాంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకోవద్దని వారించినట్టు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. పటాన్ చెరు టికెట్ తనకు రాలేదన్న కోపంతో ఈ ఉదయమే గాంధీ భవన్‌, రేవంత్‌ ఇంటి వద్ద తన కాటా శ్రీనివాస్‌ అనుచరులు హంగామా చేశారు. నిన్న కాక మొన్న చేరిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆవేశంతో రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శలు చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన కాటా శ్రీనివాస్ అనుచరులు.. గాంధీభవన్‌ వద్ద ఆందోళనకు దిగారు. పట్టణంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి పోస్టర్లు, బ్యానర్లను కాల్చేశారు.

తొమ్మిదేళ్లుగా పార్టీకి సేవలందిస్తోన్న కాటా శ్రీనివాస్‌ను కాదని మధుకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. ప్రలోభాలకు లోనై టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ క్రమంలో రేవంత్ ఇంటి వద్ద నిరసన తెలపగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రేవంత్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ అనుచరులను అరెస్ట్ చేశారు. పరిణామాలు గ్రహించిన అధినాయకత్వం పటాన్‌చెరు టికెట్ అంశంపై పునరాలోచనలో పడినట్టు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని దామోదర్‌కు కూడా చెప్పారని ప్రచారం నడుస్తోంది.
కాంగ్రెస్ లో టిక్కెట్ లొల్లి
కాంగ్రెస్‌ అభ్యర్ధుల నాలుగో జాబితా విడుదల కాగానే అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. పలు నియోజకవర్గాల్లో టిక్కెట్‌ రాని నేతల అనుచరులు ఆందోళన చేపట్టారు. గాంధీభవన్‌ దగ్గర పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పటాన్‌చెరు టిక్కెట్‌ రాకపోవడంతో రేవంత్‌ ఇంటిని ముట్టడించారు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులు .పటాన్‌చెరు టిక్కెట్‌ను నీలం మధుకు అమ్ముకున్నారని నినాదాలు చేశారు. కాట శ్రీనివాస్‌ మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ్మా అనుచరుడు. అయితే పటాన్‌చెరు అభ్యర్ధి విషయంలో తొందరపడ నిర్ణయం తీసుకోవద్దని దామోదర రాజనర్సింహాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో టిక్కెట్‌ శ్రీనివాస్‌ గౌడ్‌కే వస్తుందని, ఆందోళన విరమించాలని శ్రీనివాస్‌కు దామోదర సూచించారు.వనపర్తి టిక్కెట్‌ను తనకు కేటాయించి , బీఫామ్‌ నిరాకరించడంతో మాజీ మంత్రి చిన్నారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. మేఘారెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పార్టీ అధికారం లోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని , ఓపిక పట్టాలని కార్యకర్తలకు చిన్నారెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర
కాంగ్రెస్‌ అభ్యర్ధుల నాలుగో జాబితా విడుదల కాగానే అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. పలు నియోజకవర్గాల్లో టిక్కెట్‌ రాని నేతల అనుచరులు ఆందోళన చేపట్టారు. గాంధీభవన్‌ దగ్గర పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పటాన్‌చెరు టిక్కెట్‌ రాకపోవడంతో రేవంత్‌ ఇంటిని ముట్టడించారు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులు .పటాన్‌చెరు టిక్కెట్‌ను నీలం మధుకు అమ్ముకున్నారని నినాదాలు చేశారు. కాట శ్రీనివాస్‌ మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ్మా అనుచరుడు. అయితే పటాన్‌చెరు అభ్యర్ధి విషయంలో తొందరపడ నిర్ణయం తీసుకోవద్దని దామోదర రాజనర్సింహాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో టిక్కెట్‌ శ్రీనివాస్‌ గౌడ్‌కే వస్తుందని, ఆందోళన విరమించాలని శ్రీనివాస్‌కు దామోదర సూచించారు.వనపర్తి టిక్కెట్‌ను తనకు కేటాయించి , బీఫామ్‌ నిరాకరించడంతో మాజీ మంత్రి చిన్నారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. మేఘారెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే పార్టీ అధికారం లోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని , ఓపిక పట్టాలని కార్యకర్తలకు చిన్నారెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.కొత్తగూడెం టిక్కెట్‌ను సీపీఐకి ఇవ్వడంపై కాంగ్రెస్‌ నేత ఎడవెల్లి కృష్ణ అనుచరులు ఆందోళన చేపట్టారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ను నిలబెట్టిన తనకు అన్యాయం జరుగుతోందన్నారు. టిక్కెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ఎడవెల్లి కృష్ణ స్పష్టం చేశారుసీనియర్‌ కాంగ్రెస్‌ నేత బెల్లయ్యనాయక్‌ కూడా గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్‌ టిక్కెట్‌ రాకపోవడంతో బెల్లయ్యనాయక్‌ మనస్తాపం చెందారు . రేవంత్‌రెడ్డి రెండు చోట్ల పోటీ చేసే బదులు తనకు కామారెడ్డి టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేశా