chandra-high
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబుపై పిటీషన్లు…. వాయిదా కోరుతున్న సీఐడీ

ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పు కేసులో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  దాఖలు చేసిన  పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. ఈ కేసులో తాము  పీటీ వారెంట్‌పై ఒత్తిడి చేయబోమని ఏజీ చెప్పారు. గతంలో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్య కారణాలతో  హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో  ప్రభుత్వం దాఖలు చేసిన వరుస కేసుల్లో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదాలు కోరుతోంది ప్రభుత్వం. మరో వైపు  ఏపీ సీఐడీతనపై మోపిన ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని కూడా తప్పు పట్టడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉచిత ఇసుక ఇవ్వడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఉచిత ఇసుక విధానంపై కేబినెట్‌లో ముందు చర్చించలేదంటూ ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొనడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌  విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసులోనూ విచారణను సీఐడీ వాయిదా కోరే అవకాశం ఉంది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ముందు రోజే  మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతిచ్చారని సీఐడీ కేసు పెట్టింది. ఆయనను ఏ3(A3)గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.  ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చీఫ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీఐడీ కోరింది.

దీంతో  ఎన్‌. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు నవంబర్‌ 21కి వాయిదా వేశారు. ఇలా చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్న సీఐడీ  వాటిపై ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేస్తున్న పిటిషన్లపై విచారణలకు వాయిదాలు కోరుతోంది. ఎల్వీప్రసాద్ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్పూర్తయింది. 45 నిమిషాల్లో ఎల్వీప్రసాద్ వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఎల్వీప్రసాద్ ఆస్పత్రి నుంచి కాన్వాయ్‌లో టీడీపీ చీఫ్ ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు.  జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరుగగా..  ఇప్పుడు కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది.  ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు.