ఆంధ్రప్రదేశ్

జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ

కాకినాడ: పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఓ మహిళా డాక్టర్ పై కొందరు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కాకినాడ ప్రభుత్వాసుపత్రి కి చెందిన జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమం చేపట్టారు. వాయిస్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో పనిచేసే వైద్యులకు రక్షణ కల్పించాలని, ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్యులకు రూములు కేటాయించడంతోపాటు అక్కడ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులు నివారించేందుకు కేంద్ర స్థాయి లో  ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు .ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్, రంగరాయ వైద్య కళాశాల న్యూరో సర్జరీ విభాగ్యపతి డాక్టర్ విజయ శేఖర్, పి జి రెండో సంవత్సరం వైద్యులు డాక్టర్ అమృతవల్లి, జూనియర్ డాక్టర్ల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు.