road-bridge
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

45 రోజుల తర్వాత రాకపోకలు పునరుద్ధరణ

రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జికి మరమ్మతులు పూర్తయ్యాయి. దీంతో ఈ బ్రిడ్జిపై శనివారం నుండి రాకపోకలు పునరుద్ధరించారు. సుమారు 2.10 కోట్ల వ్యయంతో రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మరమ్మతులు చేపట్టారు. ఆసియా ఖండంలోనే పొడవైన బ్రిడ్డిల్లో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి ఒకటి. 45 రోజులుగా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తాజాగా బ్రిడ్జి మరమ్మత్తులు పూర్తికావడంతో… వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ వంతెన పైనుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, కింద రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటాయి. గోదావరిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ఉభయగోదావరి జిల్లాలను కలుపుతుంది.రాజమండ్రి-కొవ్వూరు మధ్య దాదాపు 4.4 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ బ్రిడ్జి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల రాకపోకలకు అనువుగా ఉంటుంది. దీంతో పాటు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది. కొన్ని మరమ్మత్తులు చేసినా పదే పదే సమస్యలు వస్తుండడంతో… అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు.

భారీ వాహనాలను గామన్ బ్రిడ్జి వైపు మళ్లిస్తున్నారు. తాజాగా మరమ్మతులు పూర్తికావడంతో…45 రోజుల తర్వాత తిరిగి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వాహన రాకపోకలు మొదలయ్యాయి.గోదావరి నదిపై రాజమండ్రిలో నిర్మించిన రైల్‌ కమ్‌ రోడ్ బ్రిడ్జికి మరమ్మతులు పూర్తయ్యాయి. 1974 నవంబర్‌ 20న నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్‌ ఆలీ అహ్మద్‌ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. దశాబ్దాల తరబడి రైలు, రోడ్డు బ్రిడ్జిగా సేవలందించిన ఈ వంతెన సరైన నిర్వహణ లేకపోవడంతో పూర్తిగా పాడైంది. సెంట్రల్‌ క్యారేజ్‌ వే, వయాడక్ట్‌ భాగంతో పాటు వంతెన అప్రోచ్‌లు సహా దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 10 తేదీ వరకు బ్రిడ్జిని మూసివేశారు.మరమ్మతు పనులతో పాటు, తక్షణ పునరుద్ధరణ చేపట్టేందుకు వీలుగా ఈ వంతెనపై అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వయాడక్ట్‌ భాగం, అప్రోచ్‌లు సహా బీటీ క్యారేజ్‌వే పునరుద్ధరణ, 4.473 కిలోమీటర్ల పొడవున దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్‌ గ్రిడ్‌ల ప్రత్యేక మరమ్మతులకు రూ.2.10 కోట్లను వెచ్చించినట్లు అధికారులు తెలిపారువాహన రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

సాధారణ, లైట్‌ వెయిట్‌ వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని, ఆర్‌అండ్‌బీ అధికారుల సూచనలతో మోటారు సైకిళ్లు, లైట్‌ మోటారు వెహికిల్స్‌, ఆటోలు, లగేజీ గ్యారేజీ లేని ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తామన్నారు. ఈ విషయాన్ని గమనించి నిబంధన మేరకు ఈ బ్రిడ్జిపై నుంచి ప్రయాణాలు కొనసాగించాలన్నారు.