ఈ మాజీ డిజిపి కి సుదీర్ఘ అనుభవం ఉంది. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి డిజిపి స్థాయికి ఎదిగారు. అన్ని రాజకీయ పక్షాలతో సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల ముందు రాజకీయంగా పావులు అధికారులు. జనసేనకు కీలక వ్యక్తులు అండగా నిలబడుతున్నారు. దాదాపు అన్ని రంగాల నుంచి పార్టీకి సపోర్ట్ ఉంది. అయితే వారంతా తెర వెనుక సాయం అందిస్తుండడం విశేషం. ఏపీలో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. ప్రస్తుతానికైతే వారు జనసేనకు కీలక సలహాలు అందించే స్థితిలో ఉన్నారు. తెరపైకి వస్తే ఎక్కడ రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతామని భావించి వెనక్కి తగ్గుతున్నారు. అయితే జనసేనకు ఉమ్మడి రాష్ట్రం మాజీ డిజిపి ఒకరు సేవలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసిపి అనుకూల మీడియా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. జనసేనతో పాటు పవన్ కు కీలక నివేదికలు, సలహాలను ఇచ్చేది అన్న టాక్ బలంగా వినిపిస్తోంది.ఈ మాజీ డిజిపి కి సుదీర్ఘ అనుభవం ఉంది.
పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి డిజిపి స్థాయికి ఎదిగారు. అన్ని రాజకీయ పక్షాలతో సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల ముందు రాజకీయంగా పావులు అధికారులు కూడా. కానీ ఏ పార్టీలో చేరలేదు. సమకాలీన రాజకీయ అంశాలపై సమగ్ర అవగాహన ఉంది. శ్రీకాకుళం నుంచి కడప వరకు అన్ని జిల్లాలకు సంబంధించి నివేదికలను పవన్ కళ్యాణ్ కు అందిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో జనసేన అనుసరించాల్సిన వ్యూహం పై కూడా పవన్ కళ్యాణ్ కు ఎప్పటికప్పుడు సదరు మాజీ డిజిపి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్లు సమాచారం.ఈ మాజీ పోలీస్ బాస్ పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తారని అంతా భావించారు. ఒకటి రెండు సందర్భాల్లో చంద్రబాబు, జగన్లను సైతం కలుసుకున్నారు. గత ఎన్నికల ముందు ఏకంగా వైసీపీలోకి వెళ్తారని ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. కానీ వాటన్నింటికీ చెక్ చెబుతూ తటస్థంగా ఉండిపోయారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు ఒకరు పోలీస్ ట్రాఫిక్ చలానా కుంభకోణానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.
పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. ఇప్పుడు సదరు మాజీ డిజిపి జనసేనకు సేవలు అందిస్తున్నట్లు వైసిపి అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టింది. అంటే అది కచ్చితంగా వైసీపీకి మింగుడు పడని విషయమే. సదరు అధికారి త్వరలో జనసేనకు అధికారిక సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేనలో ఆయన మరింత క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.