ఏపీ ప్రభుత్వం పించన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్య శ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు చేయనున్నట్లు పేర్కొంది. ‘మిగ్ జాం’ తుపాను నష్ట పరిహారం అందించేందుకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ కీలక నిర్ణయాలు
విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు కేబినెట్ ఆమోదం, అలాగే విశాఖలోని 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం
జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం
11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం, అలాగే ఈ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటుకు నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ సీసీ టీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతి ఇచ్చింది