పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో రూ.40 లక్షలతో నిర్మించిన 4వ గ్రామ సచివాలయని ప్రారంభించారు అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి 2 రైల్ ఓవర్ బ్రిడ్జిలను తీసుకువస్తాము ప్రజలకు ఏ కష్టం రానీయం.
అలాగే ఈ సచివాలయ స్థల దాత పరిష్రామికవేత్త ఈ.వి సుజాత శర్మకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి బుగ్గన టీడీపీ నిత్యావసరల ధరల పెరుగుదల నింద ప్రభుత్వంపై మోపడం సరికాదన్నారు. కోవిడ్-19 సంక్షోభంలోనూ కూడా సంక్షేమం ప్రవాహంలా కొనసాగింది బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారంటీ ఓ బూటకం అన్నారు2014లో పొదుపు మహిళల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ మాట తప్పింది పసుపు-కుంకుమ కూడా చంద్రబాబు ఎలక్షన్ స్టంట్ రైతు రుణమాఫీపై అనేకమార్లు మాట మార్చారు చరిత్రలో మాట మీద నిలబడని వారా భవిష్యత్ కు గ్యారంటీ హామీలను తగ్గించి, కుదించి, ఎన్నికల ముందు నెరవేర్చిన మీదా ష్యూరిటీ చెప్పింది చెప్పినట్లు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి,చెప్పింది ఏ మాత్రం చేయని వ్యక్తే చంద్రబాబు అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, సామాజిక పెన్షన్ల పెంపు లాంటివెన్నో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు బేతంచెర్ల పట్టణంలో రేషన్ కార్డు దారులకు ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున 11,857 ప్లాట్లు ఇవ్వాలంటే 300 ఎకరాలివ్వాలి అలాగే బేతంచెర్లలో నివేశ స్థలాలకు సానుకూలమైన స్థలం ఎకరాకు కోటి పైనే, రూ.300 కోట్లు అవసరం అయితే ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ధరకే ప్రజలకిచ్చాం, ప్రైవేటు భూమిని ఇవ్వడం సాధ్యమా నిన్న మాజీ మంత్రి కే.ఈ ప్రభాకర్ కూడా డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ బురిడీ మాటలను ఖండించారు 47 ఎకరాలున్న టీడీపీ డోన్ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి వేలాది కోట్లతో వందలాది ఎకరాలెలా ఇస్తారన్న కే.ఈ ప్రభాకర్ మాటలకు సమాధానం చెప్పాలి.
సొంత పార్టీ నాయకులే మిమ్మల్ని నమ్మడం లేదు.ప్రజలు ఏమి నమ్ముతారు రూ.350 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేసి త్వరలోనే ఇంటింటికీ మంచి నీటిని అందిస్తామని అన్నారు. బీ.పీ శేషారెడ్డి పీ.హెచ్.సీ ని సీ.హెచ్.సీగా చేసి మరింత అభివృద్ధి చేశాం. రోడ్లు లేక పెళ్లి చేసుకోవాలంటే నిరాకరించే స్థాయి నుంచి డోన్ వ్యాప్తంగా చక్కగా రహదారులు బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల,ఐ.టీ.ఐ, పాలిటెక్నిక్ నిర్మించడం అభివృద్ధి కాదా అని అన్నారు అలాగే మన ముఖ్యమంత్రికి డోన్ ప్రజల మీదున్న అభిమానం, నా మీద నమ్మకానికి నిదర్శనమే అభివృద్ధి గతంలో అశాంతిని నింపిన నేల మీద శాంతిని పరిఢవిల్లేలా చేయగలిగాం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్మన్ సిహెచ్ చలం రెడ్డి, ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ మురళీకృష్ణ, ఉర్దూ కమిటీ సభ్యులు ముర్తూజావలి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖాజా, సలీం, పిట్టల జాకీర్ హుస్సేన్, వెంకటేశ్వర్ రెడ్డి తాసిల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు