కరీంనగర్‌లో బండి సంజయ్ అకృత్యాలతో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌కి నిరాశే మిగిలింది.ధర్మం కోసం అని దేవుడి పేరు చెప్పే బండి సంజయ్ ఒక్క గుడికి పైసా ఇవ్వలేదని విమర్శించారు. మేము వెంకటేశ్వర స్వామి గుడి, ఇస్కాన్ కడుతుంటే బండి సాయం ఏది?ఎంపీగా బండి సంజయ్ ఘోరంగా విఫలం అయ్యారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ మంచి మెజార్టీతో నాలుగోసారి విజయం సాధించబోతున్నదని, దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మేము మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబపెట్టేందుకు డబ్బుల పంపిణీకి వెళ్లిన బండి సంజయ్సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ వాళ్లు డబ్బులు, మద్యం పంపిణీ చేశారు. బండి సంజయ్ కొత్తపల్లిలో చాలా దారుణంగా వ్యవహరించాడు.
పార్లమెంటు సభ్యుడి స్థాయిలో హుందాగా ఉండాల్సిన వారు అలా చేయడం ఏంటి ?సంజయ్ డబ్బులు, మద్యం పంపిణీ చేయలేదని భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రమాణం చేస్తారా..? అని సవాల్ విసిరారు.నిన్న కొత్తపల్లిలో డబ్బులు పంపిణీ చేస్తుంటే మా వాళ్లు పట్టుకున్నారు. డబ్బులు పంచుతూ బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయి, రివర్స్‌లో అడ్డుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని గొడవ చేశారు. బండి సంజయ్ డబ్బులు పంచారని సీసీ ఫుటేజీలో చాలా క్లియర్ గా కనిపించిందన్నారు. ఇంట్లో ఉన్న మా కార్యకర్తపై స్వయంగా దాడులు చేసాడు. మేము డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్న సంజయ్ మొదట పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని సూటిగా ప్రశ్నించారు.
ఒక ఎంపీవి అయి ఉండి గుండాలను తీసుకుపోయి దాడులు చేస్తావా..ఇంట్లో ఉన్న కార్యకర్తను కొట్టి బూతులు తిడతావా? ఇదేనా దేశం, కోసం ధర్మం కోసం పని చేయడమని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ చూపెట్టిన ఓటర్ లిస్ట్ వారి కారులోనే దొరికింది. మా మీద బురద చల్లుతున్నాడు. లక్ష సెల్ ఫోన్లు అని ప్రచారం చేసిన సంజయ్ అవి ఎక్కడ ఉన్నాయి. నిజంగా మేము పంచినట్లయైతే ఒక్కటైనా చుపించాలిగా ? సీఎంఓ నుంచి అధికారులు వచ్చి డబ్బులు ఎందుకు పంచుతారన్నారు. మళ్లీ నీ బూటకపు మాటలు నమ్మే స్థితిలో కరీంనగర్ ప్రజలు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ ఓడిపోవడం ఖాయమన్నారు.