ఈరోజు నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సినిమాహాళ్లను పునర్ ప్రారంభించారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సోమవారం నుంచి సినిమాహాళ్లు, మల్టీప్లెక్సులు, స్టేడియాలను తెరిచారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం పరీక్షలను పెంచి, ర్యాపిడ్ చికిత్స చేసి, వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేయడంతో కరోనా అదుపులోకి వచ్చింది.
దీంతో సోమవారం నుంచి సినిమాహాళ్లు, స్టేడియాలు, జిమ్ లు తెరిచేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనుమతించారు. యూపీలో గత 24 గంటల్లో 128 కరోనా కేసులు వెలుగుచూడగా, 305 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో యూపీలో మొత్తం 2,264 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రికవరీ రేటు 98.5శాతానికి పెరగడంతోపాటు పాజిటివ్ రేటు 0.06 శాతానికి తగ్గింది.