gaddam srinivas
తెలంగాణ రాజకీయం

అందరికి ధన్యవాదాలు

తెలంగాణ శాసనసభ లో గురువారం సీఎం మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ,ఎంఐఎం ,సీపీఐ , సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారు.. భవిష్యత్ లో కూడా ఇలాగే కొనసాగాలి. గడ్డం ప్రసాద్ నా సొంత జిల్లా నేత. వికారాబాద్ కు ఎంతో విశిష్టత ఉంది.
వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారు. కింది స్థాయి నుండి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎదిగారు. వికారాబాద్ అభివృద్ధి లో గడ్డం ప్రసాద్ ది చెరగని ముద్రని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లడుతూ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కి అభినందనలు. పేద వాల్ల సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్  రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సబ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నా. శాసనసభ లో చర్చలు అర్థవంతంగా నడుపుతాడాని విశ్వసిస్తున్నానని అన్నారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుమాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కి అభినందనలు. శాసనసభ లో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తాడని స్పీకర్ పై పూర్తి నమ్మకం వుంది. విపక్షాలు స్పీకర్ కి మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు. స్పీకర్ నిర్ణయాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంద. మా తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభ లో పని చేసి ఆ చైర్ కి ఔన్నత్యం ని తీసుకొచ్చాడని అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కేసీఆర్ మమ్మల్ని ఆదేశించారు. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాగే సభ హక్కులను కాపాడాలని కోరుతున్నా. సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలి. తెలంగాణ ఉధ్యమ సమయంలో సిరిసిల్ల కు రావాలని నేను గడ్డం ప్రసాద్ ను ఆహ్వానించా.. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన రాలేకపోయారని అన్నారు.