kcr-discharge
తెలంగాణ రాజకీయం

ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్.. సొంతింటికి చేరిన కెసిఆర్

సోమాజిగూడ య‌శోద ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నేరుగా నందిన‌గ‌ర్‌లోని త‌న సొంతింటికి వెళ్లారు. సొంతింటికి చేరుకున్న కేసీఆర్‌కు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో దిష్టి తీసి, హార‌తితో ఇంట్లోకి స్వాగతం ప‌లికారు. అనంత‌రం కేసీఆర్ త‌న ఇంట్లోకి అడుగుపెట్టారు.కేసీఆర్‌కు ఎడమకాలి తుంటి ఫ్రాక్చర్ కావడంతో యశోద ఆస్ప‌త్రిలో ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. వారం రోజుల పాటు చికిత్స అనంతరం కోలుకున్న నేపథ్యంలో కేసీఆర్‌ను శుక్ర‌వారం ఉద‌యం డాక్ట‌ర్లు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.