ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీలో సీట్ల టెన్షన్…

వైసీపీ ఇప్పటి నుంచే రానున్న ఎన్నికల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో యాక్టివ్ గా లేని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేనట్లు సమాచారం. అందుకే వారిని తాడేపల్లికి పిలిపించి జగన్‌ పర్సనల్‌ గా మాట్లాడుతున్నారు. ఏపీ పాలిటిక్స్‌ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌ తన ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ మొదలైంది. ఎప్పుడూ ఎవరికి తాడేపల్లి నుంచి ఫోన్‌ వస్తుందో అని భయపడతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల సీట్ల మార్పుల పై వైసీపీ ఇప్పటికే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో జగన్‌ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల మీద దృష్టిపెట్టారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలను క్యాంపు ఆఫీసుకు పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మార్పులకు అవకాశాలు ఉండే నియోజక వర్గాలు..రాజమండ్రి రూరల్‌, పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పి.గన్నవరం, రామచంద్రాపురం.

నరసాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు, విజయవాడ వెస్ట్‌, విజయవాడ సెంట్రల్‌, తిరువూరు, అవనిగడ్డ, పెడన, దర్శి, పొన్నూరు, పెనుగొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల మీద జగన్ ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా మరి కొన్ని నియోజకవర్గాల మీద కూడా జగన్‌ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరికొంత మందికి నియోజకవర్గంలో సరిగా పనులు చేయాలని వార్నింగ్ ఇచ్చేందుకు జగన్ పిలుస్తున్నారని సమాచారం. దీంతో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా వారి వినతులు వినిపించేందుకు సీఎం క్యాంప్‌ ఆఫీసుకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తాడేపల్లికి చేరుకున్నారు. రాయలసీమనుంచి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఉమ్మారెడ్డిలతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్‌ కి కూడా క్యాంపు ఆఫీస్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు చేపట్టే మార్పుల తరువాత పూర్తి స్థాయి దృష్టి ఎన్నికల మీద పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే టికెట్‌ ఇవ్వని వారికి వైసీపీ ముందుగానే చెప్పేస్తుంది.

ఇప్పటికే 11 సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పటికే ప్లెస్‌ మారిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. ఇప్పటికే మద్దాలిగిరి, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, తిప్పల నాగిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నో టికెట్‌ అని వైసీపీ చెప్పేసింది. సెకండ్‌ టైమ్‌ లో మరో ఐదుగురికి ఉద్వాసన పలికే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురు వైసీపీ సిట్టింగ్‌ నేతలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం లేదు. గడిచిన వారం రోజుల నుంచి ఇప్పటి వరకు క్యాంప్‌ ఆఫీసుకు సుమారు 30 నుంచి 35 మంది ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలకు ఎంపీలుగా, ఎంపీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చేందుకు జగన్‌ రెడీ గా ఉన్నట్లు సమాచారం.