పార్లమెంట్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28 న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించిన పలితాలు రాకపోయినా ఓట్ల శాతం పెరిగింది… సీట్లు పెరిగాయి. ఎల్లుండి సమావేశానికి అమిత్ షా వస్తున్నారు. మండల అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలు ఈ మీటింగ్ కు హాజరు అవుతారు. 90 రోజుల ఆక్షన్ ప్లాన్ వుంటుంది. తెలంగాణ లోని అన్ని వర్గాల్లో బీజేపీ కి, మోడీ కి సానుకూల చర్చ జరుగుతుంది. ఎన్నికల కోసం. మోడీ కి ఓటు వేయడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అద్భుత మెజారిటీ తో ఎవరు ఊహించని విధంగా మోడీ హ్యాట్రిక్ సదించబోతున్నారు. తెలంగాణ లో బీజేపీ కి డబల్ డిజిట్ ఎంపి సీట్లు వస్తాయి. 2019 తో పోలిస్తే తేడా ఉంది… తెలంగాణ లోని ప్రతి ఇంట్లో మోడీ చర్చ జరుగుతుంది.
శాసన సభ ఎన్నికల కు సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాము. జనవరి నెలలో పార్టీ సంస్థాగత బలోపేతం పై దృష్టి పెడతాము. యువత బీజేపీ వైపు ఉంది. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమం లో బీజేపీ భాగస్వామ్యం కావాలని నిర్ణయించిందని అన్నారు.