praja palana
తెలంగాణ రాజకీయం

నాలుగు నెలలకొకసారి ప్రజాపాలన

ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీల అమలుపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి ప్రజాపాలన కార్యక్రమం  కింద దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రజా పాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా  గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు ప్రజలు. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఆరు గ్యారెంటీల పథకాలు పొందేందుకు దరఖాస్తు ప్రక్రియ ముగియనుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికి చాలా మంది ఇంకా దరఖాస్తులు చేసుకోలేదు. ఈ పథకాలు పొందేందుకు కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలా?, కొత్తగా రైతు బంధు అప్లై చేయాలా? వద్ద?, కరెంట్ బిల్లు మగవారి పేరు మీద ఉండలా? లేదా ఇంట్లోని మహిళల పేరు మీద ఉండలా? అనే సందేహాలతో ప్రజలు దరఖాస్తులు చేయలేదు. మరికొన్ని చోట్లల్లో దరఖాస్తులు ఫామ్స్ లేకపోవడం ప్రజలు ఇబ్బందుకు పడ్డారు. రేపటితో దరఖాస్తులకు ఆఖరి తేదీ కావడంతో గడువు పెంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రజాపాలన కార్యక్రమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది. 6 గ్యారంటీల దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజా పాలన కార్యక్రమానికి డిసెంబర్‌ 31, జనవరి1 ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో ఈ గడువును మరో 2రోజులు పొడిగించే ఛాన్స్‌ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చివరి రోజు కావడంతో  ప్రజాపాలన కార్యక్రమానికి భారీగా రద్దీ పెరిగింది. ఇప్పుడు అప్లై చేయకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రతీ 4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని సీఎస్ శాంతికుమారి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.