kishan reddy
తెలంగాణ రాజకీయం

కేంద్ర పథకాలను ఉపయోగించుకోవాలి

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో బిజెపి పార్టీ సమావేశాలు నిర్వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులోనే భాగంగానే నేడు బోరబండలో రెవిన్యూ, బ్యాంక్ అధికారులతో కలిసి ఆయన ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అద్భుతమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని, వాటిని ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎన్నో కుటుంబాల్లో ఆనందం నెలకొందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకోవాలన్నారు. ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు అన్నారు.

మరోవైపు గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుండి  రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు పదిమంది చొప్పున పొదుపు సంఘాలుగా ఏర్పాటు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు