లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ టీమ్ కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి? అంటూ వినూత్న క్యాంపెయినింగ్‌కు తెర లేపారు. 16, 17వ లోక్‌సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం అవిశ్రాతంగా పని చేశాని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విధాలను ప్రశ్నించడం, డిమాండ్ చేయడంలో ఎంత బాగా పని చేశారో తెలుస్తుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. 2024లో కూడా లోక్‌సభకు తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ నుంచే ప్రాతినిధ్యం ఉందన్నారు. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. మనమే..అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణ వాయిస్ బీఆర్ఎస్ అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ వ్యూహంమనమే తెలంగాణ గళం.. మనమే తెలంగాణ దళం.. మనమే తెలంగాణ బలం’ అని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్తున్నది.
బీఆర్‌ఎస్సే ఎప్పటికైనా తెలంగాణ కు టార్చ్‌బేరర్ అని స్పష్టం చేస్తున్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎప్పటికైనా పరిరక్షించేది బీఆర్‌ఎస్సేనని ఆధారాలతో సహా పార్టీ శ్రేణులకు వివరిస్తున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఎందుకు గెలిపించాలో అన్ని స్థాయిల పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్, బీజేపీలకు ఏమాత్రం పట్టింపులేదని ఆధారాలతో వివరిస్తున్నది. అందుకు 2014-19 (16వ లోక్‌సభ), 2019-2024 (17వ లోక్‌సభ)లో రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలను ప్రజలు ముందు ఉంచుతున్నది. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ ఎంపీలు అడిగింది 1,271 ప్రశ్నలేనని, బీజేపీ ఎంపీలు కేవలం 190 ప్రశ్నలే అడిగి చేతులు దులుపుకున్నారని బీఆర్‌ఎస్ మండిపడుతున్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రాన్ని నిలదీయడంతో ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించింది బీఆర్‌ఎస్ పార్టీయేనని స్పష్టం చేస్తున్నది.
రెండు సభల్లో బీఆర్‌ఎస్ 4,754 ప్రశ్నలు అడిగి, కేంద్రాన్ని నిలదీసిన ఉదంతాలను వివరిస్తున్నది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చడం వల్ల.. తెలంగాణలో పార్టీ బేస్ కోల్పోయిందని మన పార్టీ అనే భావన ప్రజల్లో తగ్గిపోయిందన్న అభిప్రాయంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అందుకే.. మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు .. మన తెలంగాణ – మన బీఆర్ఎస్ అనేలా ప్రచారాన్ని.. భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.
100 రోజుల కోసం ఆగాం..
లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్ దృష్టిసారించింది. దీనిలో భాగంగా పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో నాగర్‌కర్నూల్ సెగ్మెంట్ నేతలతో హరీష్‌రావు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్నాటకలో చేతులెత్తేశారు.. తెలంగాణలోనూ గ్యారంటీలను ఎత్తేస్తారు.. అంటూ పేర్కొన్నారు. గ్యారెంటీల అమలు విషయంలో.. ఇంకా 100 రోజులు కాలేదని ఆగుతున్నామని.. లేకపోతే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడే వాళ్లమంటూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారంటూ పేర్కొన్నారు.. బీఆర్‌ఎస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టమంటూ వ్యాఖ్యానించారు.
విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం లభిస్తుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలన్నారు.ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌ఘడ్ లో ఐదేళ్లకే ప్రభుత్వం మారిందని.. ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదన్నారు. ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని.. మన బడ్జెట్ ఎంత..? 2 లక్షల 90 వేల కోట్లు.. అంటూ హరీష్‌రావు గుర్తుచేశారు. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించారు. సాంప్రదాయ రాజకీయపద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారని.. కొంత అది నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందన్నారు.
బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారంటూ హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేననన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి కొంతమంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని పేర్కొన్నారు