షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ, గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. షర్మిల ద్వారా 2024 ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈనెల 21న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ ముఖ్యులు, వైఎస్ కుటుంబ అభిమాన నేతలతో ఆమె ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈనెల 21న ఇడుపులపాయలోని రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించనున్నారు. కార్యక్రమానికి ఏఐసీసీ ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో షర్మిల భారీ బలప్రదర్శనకు దిగుతారని సమాచారం. ఇందుకు సంబంధించి జన సమీకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ, గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. షర్మిల ద్వారా 2024 ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వైసీపీని నిర్వీర్యం చేస్తే 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని విశ్లేషణలు ఉన్న నేపథ్యంలో.. షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ముఖ్యంగా కడప జిల్లాలో షర్మిల ఎంట్రీ తో వైసీపీ ఆధిపత్యానికి గండి పడుతుందని తెలుస్తోంది. షర్మిల ఎంట్రీ తో జగన్ ఓటు బ్యాంకు చీలుతుందని టిడిపి అంచనా వేస్తోంది. అయితే తమకు వచ్చే నష్టం ఏమీ లేదని వైసిపి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది తెలంగాణలో రేవంత్ రెడ్డి మాదిరిగా షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం, విభజన హామీల అమలు కాంగ్రెస్తోనే సాధ్యమంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆమె పర్యటిస్తారని సమాచారం.
టిడిపి, వైసిపి, జనసేన లను టార్గెట్ చేసుకుంటారని కూడా తెలుస్తోంది. ఆ మూడు పార్టీలు బిజెపితో కలవడంపై షర్మిల కామెంట్స్ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల్లో అసంతృప్తులను కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు ఆమె ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీలో టికెట్లు దక్కని వారు షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది. అన్నింటికీ మించి షర్మిలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా.. వైసీపీని దెబ్బ తీయాలని కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.