కార్యకర్తలే పార్టీకి కథనాయకులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో నల్లగొండ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉందన్నారు. చివరిగా నల్లగొండ రివ్యూ చేస్తున్నామని గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి దైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. నల్లగొండ లో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందన్నారు. ఎక్కడా ఓటమి పై అనుమానాలు రాలేదు కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయన్నారు. సూర్యాపేట లో మాత్రమే గెలిచామని.. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ఓటమి కి అనేక కారణాలు ఉన్నాయి .. ఈ పార్లమెంటు సన్నాహాక సమావేశాలు ఆరoభం మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్ష లు మొదలవుతాయన్నారు. సోషల్ మీడియా లో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిపి కొట్ట లేక పోయామని.. అవతలి వాళ్లు అభూత కల్పనలు ,అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.
మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు ..కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీ కి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోవాలన్నారు. అధికారం లోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగన లేదు .అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారని విమర్శలు ఇచ్చారు. కాంగ్రెస్ పంగనామాలు పెట్టె ప్రయత్నం చేస్తోoది ..అయినా వదిలి పెట్టమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేoదుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారు. కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాoస వీడాలి ..ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలని పిలుపునిచ్చారు. కోమటి రెడ్డి గత నవoబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని గుర్తు చేశారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డి కే పంపండని సూచించారు. సాగర్ ఆయకట్టు కు కాంగ్రెస్ పాలన లో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు.
కృష్ణా రివర్ బోర్డు కు ప్రాజెక్టులను అప్పగిoచి తెలంగాణ జుట్టు ను కాంగ్రెస్ కేంద్రం చేతి లో పెడుతోందని.. శ్రీ రాం సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడు తోందన్నారు. కరెంటు కోతలు అపుడే మొదలు అయ్యాయి .. కాంగ్రెస్ బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసo లో బయట పడిందన్నారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బీ ఆర్ ఎస్ ను కాలుస్తారట.. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ బీజేపి అక్రమ సంబంధం గురించి చెప్పాలన్నారు. రాహుల్ అదానీ ని దొంగ అన్నారు రేవంత్ దొర అంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది ..ఈ పరిస్థితి ని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలన్నారు. కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయి ..నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టి గా పనిచేసి గెలుద్దామని కేటీార్ పిలుపునిచ్చారు. జనవరి 3 ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నల్లగొండ తో ముగిశాయి.