జూలై 28 వరకు పొడిగింపు
కోవిడ్ నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టేను పొడిగించింది. జూలై 28వ తేదీ వరకు యాత్రను నిలిపివేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. స్వల్ప సంఖ్యలో యాత్రికులను అనుమతించాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను మళ్లీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లైవ్‌లో చార్‌ధామ్ దర్శనం కల్పించాలని కోర్టు కోరింది. గంగోత్రీ, యమునోత్రీ, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు ప్రస్తుతం భక్తులను వెళ్లనివ్వడంలేదు.