ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

టీటీడీ పాలక మండలి సభ్యుడిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం

మై హోం గ్రూపు వ్యాపార సంస్థల చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలిని సెప్టెంబర్‌ 19న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కూడిన పాలక మండలిని నియమించింది.