ttd palaka mandali
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ముగిసిన టీటీడీ పాలకమండలి మీటింగ్

5141కోట్లతో టీటీడీ పాలకమండలి ఆమోదముద్ర వేసింది. తిరుమలలో స్థానిక అన్నమయ్య భవన్ లో నిర్వహించిన పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి  మీడియాతో నిర్ణయాలను వెల్లడించారు. టీటీడీ ప్రత్యేకంగా మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే తరహాలో లక్ష్మీ కాసులను తయారు చేసి విక్రయానికి చేయనున్నామని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
2024-25 వార్షిక బడ్జెట్ కు టీటీడీ పాలకమండలి ఆమోద ముద్ర వేసింది.దాదాపు  5141 కోట్ల అంచనాతో టిటిడి వార్షిక బడ్జేట్ రూపొందనుందన్నారు. ఇక పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ లేబర్ ను గుర్తించమని, వారి కి15 వేల రూపాయలు జీతాలు పెంచనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే తరహాలో 6 వేదపాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను 35 వేల నుంచి 54 వేలకు పెంపు చేయనునామన్నారు. టిటిడి ఆధ్వర్యంలోని 26 ఆలయాలు., టిటిడి పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకం కు ప్రభుత్వ అనుమతికి విన్నతి సమర్పించినట్లు తెలిపారు.  గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు రోడ్ల నిర్మాణంకు 30 కోట్లతో వ్యాచించేలా నిర్మించనున్నాననారు. నారాయణవనంలో కొలువైన విరభధ్రస్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయింపు చేసినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేశామన్నారు. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు., ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజిల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించామన్నారు.  

వాటర్ వర్క్స్ మరియు అన్నప్రసాదం,వేదపాఠశాలలో ఉద్యోగులు, టిటిడి స్టోర్స్ లో పనిచేస్తూన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు శుభవార్త చెప్పారు. వేదపండితుల పేన్షన్ 10 వేలు నుంచి 12 వేలుకు పెంచారన్నారు. టిటిడి ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తూన్న అర్చకుల జీతాలు పెంచుతామన్నారు. 56 వేదపారయణదారులు పోస్టులు నియామకంకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతు తీర్మానం చేసామన్నారు. అటవిశాఖ ఉద్యోగుల సమస్య గురించి రేపు కార్మికులుతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం పట్ల పాలకమండలి సానుకూలంగా ఉందన్నారు.  పిభ్రవరి 3 నుంచి 5వ తేది వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తూన్నామని తెలిపారు. ఇప్పటి వరకు 57 మంది మఠాధిపతులు,పిఠాధిపతులు సదస్సుకు హజరవుతారని తెలిపారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు,సలహాలను టిటిడి తూచా తప్పకూండా అమలు చేస్తామన్నారు.

హుండి ద్వారా 1611 కోట్లు,వడ్డి ద్వారా 1167 కోట్లు,ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లు,దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు వస్తూందని అంచనా వేశామన్నారు.  జీతాలు చెల్లింపుకు 1733 కోట్లు,ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు,కార్పస్ ఫండ్ కి 750 కోట్లు,ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.