గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో గత మూడు రోజులుగా విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీస్తు సువార్త సభలు మంగళవారం రాత్రితో విజయవంతంగా ముగిసాయి. ముగింపు సభల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యఅతిథిగా పాల్గొని క్రైస్తవ విశ్వాసులనుద్దేశించి ప్రసంగించారు. విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న సువార్త సభలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆయన హార్షం వ్యక్తం చేశారు.
ప్రేమ, జాలి, దయ, కరుణ గుణాలకు ప్రతిరూపం క్రైస్తవత్వమని ఎమ్మెల్యే నాని అన్నారు. నిత్యం ఏసు ప్రభువును ప్రార్థించే సీఎం జగన్ రాష్ట్రంలోని పేద వర్గాల ఉన్నతికి ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ప్రభు ఆదేశించినట్లు రెండు లక్షల 50వేల కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా ప్రజలకు అందించిన వ్యక్తి సీఎం జగన్ అని ఎమ్మెల్యే నాని కొనియాడారు. నిత్యం ప్రజల కోసం పరితపించే సీఎం జగన్ కుటుంబానికి ఏసుప్రభు ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మతవిశ్వాసాలకు అనుగుణంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా చూడాలని సీఎం జగన్ ప్రభుత్వ యంత్రాంగానికి నేరుగా చెప్పారని ఎమ్మెల్యే కొడాలి నాని తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే కొడాలి నాని అభినందించారు. ప్రార్థనల నిర్వహణకు తమకు ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణాన్ని సమకూర్చడమే కాక, సభల విజయవంతానికి సహకారం అందించిన ఎమ్మెల్యే కొడాలి నానికు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, దైవ సేవకులు ఎమ్మెల్యే కొడాలి నానికు ఆత్మీయ సత్కారం చేశారు. తొలుత సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు క్రైస్తవ విశ్వాసులు కరచానాలు చేస్తూ తమ అభివాదాలు తెలియజేశారు. ముగింపు సభల్లో విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ పండు మద్దాలి, సభల ఆర్గనైజర్ శ్యాంబాబు, మంద సువర్ణ బాబు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు వెంపటి సేమన్, క్రిస్టియన్ సెల్ జోనల్ ఇంచార్జ్ కేజే విక్టర్ పాల్, బిషప్ అప్పికట్ల జాషువా, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలేటి చంటి, వల్లురుపల్లి సుధాకర్, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన దైవ సేవకులు, వేలాదిగా క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.