ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

రాష్ట్ర ప్రభుత్వం నిధుల‌కు లెక్క చూపాలి

జ‌గ‌న్‌కు ర‌ఘురామ కృష్ణ‌రాజు మ‌రో లేఖ‌

ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ కు ఈరోజు మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 41,000 కోట్ల రూపాయలకు పైగా నిధులకు సరైన లెక్కలు చూపలేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి తగు వివరణ ఇస్తే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుందని సూచిస్తూ ఈ లేఖ రాశారు.

ఆర్థిక శాఖ బిల్లుల ఆడిట్ అంశాన్ని ర‌ఘురామ త‌న‌ లేఖలో రాసుకొచ్చారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిధులు బదిలీ చేశార‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. అలాగే, నిధులకు లెక్కలు చూపలేద‌ని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎఫ్‌ఎంఎస్ నుంచి చేస్తున్న చెల్లింపులపై ఆడిట్ జరిపించాలని కోరారు.