brs
తెలంగాణ రాజకీయం

కృష్ణా నదీజలాలపై   తెలంగాణ హక్కులను కోసం ఎంతవరకైనా పోరాడుతాం

 భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు బీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల అంశంపై పోరాటంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్‌ఎంబీకి అప్పగించగా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సంకల్పించి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని తీసుకుపోయేలా ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు.ఈ ఇందులో భాగంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

కృష్ణా నదీజలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదన్నారు. తెలంగాణ ఉద్యమకారులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు.