dalit bandhu
తెలంగాణ రాజకీయం

దళిత బంధు స్కీమును యధావిధిగా కొనసాగించాలి

గత ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు స్కీమును తీసుకువచ్చారని కొంతమందికి ఇచ్చిన తరువాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దళిత బంధు స్కీమును అప్పటి ప్రభుత్వం ఆపివేసిందని ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దళిత బంధు స్కీమును యధావిధిగా కొనసాగించి మా దళిత కుటుంబాల అభ్యున్నతికి పాటుపడాలని  దళిత బంధు సాధన కమిటీ మంథని నియోజక వర్గం డివిజన్ అధ్యక్షులు ఉట్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పోనగంటి రాజనర్స్ డివిజన్ కోశాధికారి గద్దల శంకర్ డివిజన్ కార్యదర్శి కాదశి తిరుపతి లు రాష్ట్ర ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితులు సామజికంగా ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ఈ స్కీమును తీసుకురావడం జరిగిందని, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కూడా దళితుల కుటుంబాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మా కుటుంబాలు చిన్నభిన్నమవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన విధానంతో గత ప్రభుత్వం ఈ స్కీమును తీసుకురావడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 1100 చొప్పున లబ్ధిదారులను కలెక్టర్  ఆదేశాల మేరకు ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో లబ్ధిదారుల సెలెక్ట్ అయిన వారిని ఇంటింటికి తిరిగి ఎంక్వయిరీ చేయడం జరిగిందని దానికి  మేము అంత కూడా మా యొక్క కుల నివాస ధ్రువపత్రాలు బ్యాంకు జీరో అకౌంట్ తీసి వారికి ఇవ్వడం జరిగిందని, మమ్మల్ని ఎంపిక చేసి యూనిట్కు అర్హులుగా గుర్తించి మా పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి కలెక్టర్ కి పంపించారని తెలిపారు.

కలెక్టర్  నుండి సంబంధిత మంత్రికి  పంపిస్తే మరల ఎస్సీ కార్పొరేషన్ ఈడి  మా యొక్క జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారని దానిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 437 కోట్ల బడ్జెట్ను 33 జిల్లాల కలెక్టర్లకు పంపించారని పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయిన ఈ స్కీమును నిరంతరం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంథని నియోజక వర్గం దళిత బంద్ సాధన కమిటీ పక్షాన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో దళిత బంధు సాధన కమిటీ ప్రచార కార్యదర్శి పుల్లూరు తిరుపతి, మంథని మండల ప్రధాన కార్యదర్శి రాజబాబు, గడిపల్లి శ్రీనివాస్, కమాన్పూర్ మండల ప్రధాన కార్యదర్శి దాసరి రామస్వామి, ఎరుకల శేఖర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.