వికారాబాద్ జిల్లా కేంద్రంలో సుమారుగా 50 కుల సంఘాల నాయకలతో బీసీ ల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హజరయ్యారు.
కవిత మాట్లాడుతూ…బీసీ ల హక్కుల సాధనకై ఈ నెల 12 వ తేదీన ఇందిరా పార్కులో మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టానున్నామని ఈ కార్యక్రమానికి ఇతర రాష్టల బీసీ నాయకులు, మేధావులు, హాజరుకాన్నునరాని..బీసీల ఎదుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీసీల అభివృద్ధికి ప్రతి యేటా 20వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని..తెలంగాణ అసెంబ్లీ లో ఫూలే విగ్రహాన్ని స్థాపించాలని..తక్షణమే బీసీల కుల జనగనన చేపట్టి 42%చట్ట సభల్లో బీసిలకు రిజర్వేషన్ కల్పించి లోకల్ బడి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.