rythu bandu-bheema
తెలంగాణ రాజకీయం

రైతు బంధు, రైతుబీమా పేరుతో దోపిడి

 రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు పక్కదారి పడుతున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టారు.నకిలీ పత్రాలతో రైతు బంధు,రైతు భీమా డబ్బులు కాజేస్తున్నారని రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.గత కొన్నేళ్ళ నుంచి రైతుబంధు, బీమా డబ్బులను నిందితులు విత్ డ్రా చేసుకొని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ తిన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి….. నకిలీ వ్యక్తుల పేర్లతో డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భూములు లేకపోయినా ఉన్నట్లుగా సృష్టించి….. రైతుబంధు,రైతు బీమా పథకాలు డబ్బులను తీసుకున్నట్టు తెలిపారు.నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. అయితే దీనిపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రైతుబంధు, రైతు భీమా మీద పథకం డబ్బులు కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో 20 రైతు భీమా క్లెయిమ్ లు జరిగినట్లు వెల్లడించారు.అయితే ఈ 20 క్లెయిమ్స్ అనుమానాస్పదంగా ఉన్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్ తమతో చెప్పినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ 20 రైతు భీమా క్లెయిమ్స్ ద్వారా సుమారు రూ.కోటి రూపాయల ఎల్ఐసి అమౌంట్ రైతు భీమా కింద డైవర్ట్ చేసినట్లు అవినాష్ మహంతి వెల్లడించారు. సుమారు 130 నకిలీ పట్టాధారులను సృష్టించి రైతు బంధు స్కీం లో క్లెయిమ్ చేశారన్నారు.ఇందులో కొంత మంది అప్పటికే మరణించి ఉన్నారని సంచలన విషయాలు భయట పెట్టారు.

కందుకూరు మండల పోలీస్ స్టేషన్లో ఏఈఓ గోరటి శ్రీశైలం తో పాటు వీర స్వామిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. 2000 మంది రైతులకు దక్కాల్సిన రైతు బంధు, రైతు భీమా డబ్బును మళ్లించి…… డెత్ సర్టిఫికెట్ లో పైన కింద ఒరిజినల్ అని ఉంటుందనీ….. కానీ మధ్యలో ఉండే పేర్లు, ఇతర వివరాలను ఏఈఓ శ్రీశైలం మార్ఫింగ్ చేసినట్లు ఆయన వివరించారు. ఈ డబ్బుతో ఏ ఈ ఓ శ్రీశైలం వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు అవినాష్ మహంతి తెలిపారు.తన బంధువులు, ఇతర కుటుంబ సభ్యులకు భూములు ఉన్నాయని తనకు మాత్రమే లేకపోవడంతోనే ఇలా చేసినట్లు నిందుతుడు శ్రీశైలం ఒప్పుకున్నట్లు సీపీ పేర్కొన్నారుఏకంగా 2000 మంది రైతులకు సంబంధించిన రైతు బంధు,రైతు భిమను శ్రీశైలం మరియు వీర స్వామి గత కొన్నాళ్లుగా కానేస్తునట్లు చెప్పుకొచ్చారు.రైతులు రైతు బంధు,భీమా పథకాల డబ్బు గురించి నిలదీసిన ప్రతీ సారి ఏదో ఒక సాకు చెప్పే వాడని సీపీ వివరించారు. వీరస్వామితో ఏడు బ్యాంక్ అకౌంట్లు ,జాతీయ బ్యాంకులలో ఎకౌంట్లు క్రియేట్ చేశాడని…..ఏటీఎం బ్యాంక్ పాస్ బుక్ లు మాత్రం తన వద్దే పెట్టుకునే వాడని తెలిపారు. ఏఈఓ అక్రమంగా కొనుగోలు చేసిన భూమిని,ఇతర ఆస్తులను,నగదును ఏసీబీకి అప్పగిస్తామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.
టెలిగ్రామ్ యాప్ లో పరిచయం,
పెట్టుబడి పేరుతో రూ.50 లక్షలు మోసం
ఇటీవల పెట్టుబడి పేరుతో ఓ మహిళ నుంచి రూ.50 లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. దుబాయ్ లో నుంచి ఓ వ్యక్తి స్థానికంగా ఇద్దరు వ్యక్తులతో ఈ దందా నడిపించినట్లు గుర్తించారు. సామాజిక మధ్యమల ద్వారా పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ మహిళకు టెలిగ్రామ్ యాప్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు తాము సూచించిన యాప్ లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఆమెకు వాటికి సంబంధించిన లింకులు పంపి సదరు మహిళ నుంచి పలు దఫాలుగా రూ.49,45,900 లను కాజేసి ఆమెను మోసం చేశారు. దీంతో బాధిత మహిళా గతంలోనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా….. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో అకౌంట్ హోల్డర్స్ గా ఉన్న జానీ, ఇమాన్యుల్ అనే ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు