తెలుగుదేశం పార్టీకి పెద్ద అండ సోషల్ మీడియా. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఇటీవల కాలంగా బలంగా పనిచేస్తోంది. మరోవైపు ఓ జర్నలిస్టుల బృందం సైతం సహకారం అందిస్తుంది. మంచి పదజాలాలతో సాగే కథనాలు దర్శనమిస్తుంటాయి. అదే సమయంలో ఎల్లో మీడియాలో.. పొత్తులపై కథనాలు, భాగస్వామ్య పార్టీలపై ఒత్తిళ్లతో ఒక రకమైన హైప్ క్రియేట్ చేసే పనిలో ఒక టీం పని చేస్తుందని ప్రచారం జరుగుతోంది.సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇంత తక్కువ సీట్లు కేటాయిస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిని అలుసుగా చేసుకుని ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా రెచ్చిపోతోంది. ఈ తరుణంలో పవన్ ప్రత్యేక ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని.. అందుకే ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పొజిషన్లో జనసేన లేకపోయిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇప్పుడు దీనినే హైప్ చేసేందుకు చంద్రబాబు ప్రత్యేక టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 24 అసెంబ్లీ సీట్లు జనసేనకు ఇవ్వడం సముచితమేనని.. ఈ స్థానాల్లో జనసేన ను గెలిపించి పవన్ స్టామినాను పెంచాలని.. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో జనసేన బలీయమైన శక్తిగా ఎదుగుతుందని.. పవన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందని ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. జనసైనికుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించడం అన్నది ఈ బృందం ముఖ్య ఉద్దేశం.ఇప్పటివరకు పొత్తులపై బిజెపి ముందుకు రావడం లేదు. అగ్రనేతలు పెద్దగా స్పందించడం లేదు. దీంతో బిజెపి వైసిపి ట్రాప్ లో ఉందని.. జగన్ కు ఇబ్బంది పెట్టే ఉద్దేశం బిజెపికి లేదని తెలుగుదేశం సోషల్ మీడియా ఒక రకమైన ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే దీని వెనుక సైతం పెద్ద టాస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపిని అచేతనం చేసి ఇచ్చిన సీట్లు తీసుకోవాలని ఒత్తిడి పెంచడం.. లేకుంటే బిజెపి, వైసిపి ఒక్కటేనని చెప్పి.. టిడిపి,జనసేన మాత్రమే కలిసి పోటీ చేయడం.
ఈ రెండు ఉద్దేశాలతో చంద్రబాబు టీం, సోషల్ మీడియా, ఎల్లో మీడియా సమన్వయంతో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పక్కా వ్యూహంతోనే.. పొత్తులో సింహభాగం ప్రయోజనాలను టిడిపి పొందాలని.. ఓట్ల బదలాయింపు సక్రమంగా జరపాలని ఈ బృందానికి టాస్క్ ఇచ్చినట్లు సమాచారం. వారం రోజుల పాటు ఈ బృందం ఏపీలో పని చేయబోతుంది.