జగన్నాథగట్టు పై నిర్మించనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి మార్చి 4వ తేదిన శంకుస్థాపనను చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు.
జగన్నాథగట్టు పై జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి మార్చి 4వ తేదిన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజతో కలిసి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య హెలిపాడ్, వేదిక స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్నాథగట్టు పై నిర్మించనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తాత్కాలికంగా నిర్ణయించినట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో హెలిప్యాడ్, వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా పైలాన్, సభా వేదిక ప్రాంగణం, హెలిపాడ్ ఏర్పాటుపై జేసీ, ఎస్పీ చర్చించారు.. హెలిపాడ్ ఏర్పాటుకు పలు ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, డిఎస్పీ విజయ శేఖర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజు, ఈఈ సురేష్ బాబు, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.