గెలిచిన ప్రతిసారి మగవాడిని …. ఒడితే కాదు అంటావా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ ను నిలదీసారు. కొడంగల్ లో ఒడిపోయినప్పుడు మగడివికాదా. మగాడివి అయితే, రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయమని అన్నారు. ఆడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయ్యి. అడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా… ఇందే మాటాలు. రేవంత్ కు ఇన్ పిరియారిటీ కాంప్లెక్స్ ఉందని అయన అన్నారు. కొండగల్, జియచ్ యంసి సమయంలో పోటీ చేసి, సవాల్ విసరి పారిపోయిండు. అయన మాటకు విలువ ఏం ఉంది. రేవంత్ గా కు దమ్ముంటే సిఏం కు రాజీనామా చేయండి… మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం. అదే అయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలి. నేను సిరిసిల్లాలో ఏంఎల్యేలకు పదవి రాజీనామా చేస్తా. దమ్ముంటే రేవంత్ సిఏం పదవికి రాజీనామా పోటీకి రావాలి. రాజకీయాల్లో గెలుపు ఒటములు సహాజం. మరి నాది మేనేజ్ మెంట్ కోటా అయితే, రాహుల్, ప్రియంకాలది ఏం కోటా. రేవంత్ ది పేమేంట్ కోటా, మాణిక్యం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా. పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్, డీల్లీకి పేమేంట్ చేయాలి. బిల్డర్లను బెదిరించాలి. వ్యాపారులను బెదిరించాలి. డీల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలని అన్నారు.
అందుకే భవన నిర్మాణ అనుమతులు అపినారు… ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు. అయన నేనే సిఏం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు… అయనకు అయననే సిఏం అన్న నమ్మకం లేదా అని ప్రశ్నించారు