revanth-ap
తెలంగాణ రాజకీయం

రేవంత్ పైనే కాంగ్రెస్ ఆశలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఆ పార్టీ ఏపీ అధినేత్రిగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తరువాత గత పదేళ్లుగా రాష్ట్రంలో కనిపించని కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి చాటుకుంటున్న పరిస్థితి. వరుస సభలు, సమావేశాలతో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ పుట్టించే ప్రయత్నాలు పెరిగాయి. షర్మిల రాకతో పార్టీలో  జోష్ అయితే కనిపించింది కానీ, ఆ జోష్ రాష్ట్రంలో ఏవో కొన్ని స్థానాలలోనైనా పార్టీని విజయం దిశగా నిడిపించేంతగా లేదని పరిశీలకులు అంటున్నారు.ష్ట్రంలో వరుస సభలు, సమావేశాలతో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కీలక నాయకులతో సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. మరో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 13 తేదీల మధ్య విశాఖపట్నంలో న్యాయ సాధన పేరుతో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సభకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌రెడ్డి సోమవారం సాయంత్రం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

విశాఖలో నిర్వహిస్తున్న న్యాయ సాధన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తదితరులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎన్నికలలోనైనా సరే అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉండి తీరాలన్న పట్టుదల ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు తోడుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రచార బాధ్యతలు అప్పగించే యోచనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే నిర్ణయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హై కమాండ్ తీసేసుకుంది. రాష్ట్ర విభజన ముందు వరకూ రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి విభజన తరువాత ఉనికి మాత్రంగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో సీనియర్లు, క్రియాశీలంగా వ్యవహరించే నేతలూ అందరూ వేరే వేరే పార్టీల్లో సర్దుకున్నారు. అలా సర్దుకోలేనివారు రాజకీయంగా క్రీయాశీలంగా వ్యవహరించడం మానేశారు. కేవీపీ, పల్లంరాజు, రఘువీరారెడ్డి ఇలా పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తారన్న పేరున్న నేతలే కాకుండా, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి లగడపాటి, ఉండవల్లి వంటి అంతో ఇంతో ప్రజా సంబంధాలు ఉన్న వారు రాజకీయాలకు దూరమయ్యారు.

దీంతో గత పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. పార్టీ కార్యక్రమాలు లేవు. ఒక వేళ ఏమైన కార్యక్రమం తలపెట్టినా చురుకుగా పాల్గొనే నేతలు లేరు, క్యాడర్ లేదు. దీంతో ఆ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. ఎన్నికలలో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరవైన పరిస్థితి. ఈ తరుణంలో 2024 ఎన్నికలలో ఎలాగైనా అసెంబ్లీలో ప్రవేశించాలన్న సంకల్పంతో రాష్ట్ర కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స చేస్తున్నది పార్టీ అధిష్ఠానం. ఇందు కోసం తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు నుంచే వ్యూహరచన ప్రారంభించింది. తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినప్పటికీ, హై కమాండ్ ఆమెతో పలు మార్లు చర్చించి.. విలీనం లేకుండా ఆ పార్టీ పోటీ నుంచి దూరంగా ఉండేలా వ్యూహాత్యకంగా వ్యవహరించింది. వైఎస్పార్టీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ లబ్ధి పొందిందనడంలో సందేహం లేదు. ఆ తరువాత ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు.

ఇక్కడ కూడా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగానే  వ్యవహరించింది. పార్టీని విలీనం చేసిన షర్మిలను ఆమె కోరినట్లుగా రాజ్యసభకు పంపడం కాకుండా రాష్ట్ర ఎన్నికల బరిలోనే దింపాలని నిర్ణయించింది. దీని వల్ల వైఎస్ తనయగా షర్మిల వైఎస్ జగన్ ను గట్టిగా దెబ్బతీయగలుగుతారని భావించింది. అందుకు అనుగుణంగానే వైఎస్ షర్మిల ఎంట్రీతో జగన్ పార్టీలో కలకలం రేగింది. షర్మిల జగన్ పై నేరుగా చేస్తున్న విమర్శలు వైసీపీలో భూకంపం పుట్టిస్తున్నాయి. అయితే షర్మిల ఎంట్రీ జగన్ పార్టీని అయితే బలహీనం చేయగలిగింది కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కోరుకున్నట్లుగా రాష్ట్రంలో కొన్ని స్థానాలలోనైనా పార్టీని గెలుపు వైపు నడిపించగలదా అంటే అనుమానమే అన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నది. దీంతో పార్టీలో మరింత జోష్ నింపాలంటే.. ఏపీలో కూడా మంది ఫాలోయింగ్ ఉన్న రేవంత్ ను రంగంలోకి దింపడమే మార్గమని హైకమాండ్ భావిస్తోంది. అందుకే రేవంత్ ను ఏపీలో విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గతంలో తెలంగాణ కాంగ్రెస్ లోని షర్మిల ఎంట్రీ అన్న వార్తలు విస్తృతంగా వినిపిస్తున్న సమయంలోనే రేవంత్ ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం పని లేదనీ, ఆమె ఏపీకి వెడితే అన్ని విధాలుగా తాను సహాయ సహకారాలు అందిస్తాననీ చెప్పిన విషయాన్ని వారిక్కడ ప్రస్తావిస్తున్నారు.  ఇప్పుడు హైకమాండ్ రేవంత్ ను అదే పని చేయమంటోందంటున్నారు. అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే.. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహ రచన చేసి ఉంటుందని చెబుతున్నారు.  తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 11న విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 11న ఏపీ కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఆ కార్యక్రమానికి  రేవంత్ హాజరు అవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న రేవంత్ కు ఏపీలో కూడా మంచి పరిచయాలున్నాయి. పార్టీలకు అతీతంగా పలువురు నేతలతో ఆయనకు పరిచయాలు, స్నేహం ఉంది. ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఆ పరిచయాలు, స్నేహంతో  ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం ఆయన పని చేస్తారని అంటున్నారు.