bhumana -son
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

భూమాన అభినయ్ పై అనర్హత కత్తి

కుమారుడికి మంచి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని భూమన కరుణాకర్ రెడ్డి భావించారు. తాను టీటీడీ అధ్యక్ష పదవి దక్కించుకొని.. కుమారుడు అభినయ్ రెడ్డికి షాడో ఎమ్మెల్యేగా తీర్చిదిద్దారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించి తిరుపతి ఎమ్మెల్యేగా చూడాలని భావించారు. ప్రజల్లో తిరుగులేని నాయకుడు అనిపించుకోవడానికి టిటిడి సొమ్మును సైతం తిరుపతి కోసం వాడేసుకున్నారు. అయితే సహజంగా దోపిడీని ఇష్టపడని తిరుమల శ్రీవారు భూమన కరుణాకర్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చినట్టు ఉన్నారు. పొలిటికల్ లైఫ్ దేవుడెరుగు.. ఆయన కుమారుడిపై అనర్హత వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధించే పరిస్థితి ఉంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విచారణ చేపట్టిన ఎలక్షన్ కమిషన్ గట్టి చర్యలతో ముందుకు సాగుతోంది. ఓ ఐపీఎస్ తో సహా పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. పాత్రధారులతో పాటు సూత్రధారులను తేల్చేయడానికి అధికారులు గట్టి విచారణ చేపడుతున్నారు.

రిటర్నింగ్ అధికారులను ఏమార్చి.. వారి పేర్లతో 30 వేల ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. వాటి ద్వారా ఫేక్ ఓటర్ ఐడి లను సృష్టించారని ఈసీ గుర్తించింది. అయితే ఈ కేసులో ఏవన్ గా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లుగా అందరికీ తెలుసు. ఇప్పుడు పోలీసులకు సాక్షాలు కూడా దొరికినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి పోలీసులు, యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్తాయి. ఎన్నికల కోడ్ రాగానే ఈజీ దూకుడుగా వ్యవహరిస్తుంది. పైగా ఎలక్షన్ కమిషన్కు చెందిన కేసు కావడంతో సీరియస్ గా దృష్టి పెట్టి అవకాశం ఉంది. అప్పుడు నేరుగా అభినయ్ రెడ్డి పేరు బయటపడే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న ఆయన్ను అరెస్టు చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు కొట్టిపారేయలేమని.. అదే జరిగితే.. కచ్చితంగా తిరుమల శ్రీవారు శిక్ష వేసినట్లేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి