ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. టీ20 వరల్డ్‌కప్ (T20 world cup )లో ఈ దాయాదులు ఒకే గ్రూప్‌లో ఉన్నారు. ఐసీసీ శుక్రవారం గ్రూపులను ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య యూఏఈలో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే. సూపర్ 12లో ఇండియా గ్రూప్ 2లో ఉంది.
గ్రూప్ 1: వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రూప్ ఎ విజేత, గ్రూప్ బి రన్నరప్
గ్రూప్ 2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్ ఎ రన్నరప్, గ్రూప్ బి విజేత
గ్రూప్ ఎ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్ బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్
వరల్డ్‌కప్‌లో రెండు రౌండ్లుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రౌండ్‌లో గ్రూప్ ఎ, గ్రూప్ బిలోని 8 టీమ్స్ పాల్గొంటాయి. ఇందులో నుంచి నాలుగు టీమ్స్ ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయని ఐసీసీ వెల్లడించింది. నిజానికి ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నమెంట్ కరోనా కారణంగా యూఈఏకి తరలించారు. అయితే టోర్నీ హోస్ట్‌గా ఇండియానే ఉంటుంది.